ఆ మందులు మంచివే..

Millions of us should be taking antidepressants  - Sakshi

లండన్‌ : కుంగుబాటుకు గురై మానసిక అలజడులతో బాధపడేవారు తీసుకునే యాంటీడిప్రెసంట్‌ మందులు మెరుగ్గానే పనిచేస్తాయని ఓ అథ్యయనం వెల్లడించింది. మానసిక రుగ్మతలతో బాధపడే రోగులందరికీ ఈ మందులు సూచించాలని పేర్కొంది. మూడు దశాబ్ధాలుగా 1,20,000 మందిపై జరిపిన పరీక్షల్లో పలు అంశాలు నిగ్గుతేలాయని అథ్యయనం చేపట్టిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు వెల్లడించారు. మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు సమస్యలతో సతమతమయ్యే వారిపై ఈ మందులు ప్రభావవంతంగా పనిచేశాయని చెప్పారు. తాజా అథ్యయనంతో వైద్యులు మరింత ఎక్కువ మందికి ఈ మందులను సూచిస్తారని అన్నారు.

మరోవైపు డిప్రెషన్‌తో బాధపడేవారిలో ప్రతి ఆరుగురిలో ఒక్కరే సరైన చికిత్స పొందుతున్నారని, మిగిలిన రోగులూ ఈ మందులు వాడాలని చెప్పారు. యాంటీడిప్రెసెంట్స్‌ను మరింత విస్తృతంగా వాడాలనేందుకు ఈ అథ్యయనం దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ అండ్రియా సిప్రియానీ చెప్పారు.డిప్రెషన్‌కు సరైన చికిత్స కొరవడటమే అసలు సమస్యని చెప్పుకొచ్చారు. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top