పీసీఓడీ తగ్గించే ఆసనాలు

 yoga good fot health - Sakshi

యోగా

శరీరంలో తల నుండి కాలి వేళ్ల వరకు ప్రతి అంగానికి చేసే వ్యాయామాన్ని అంగచాలనలు అంటారు. ఆయా అంగాల కదలిక వలన అక్కడి కండరాలకు, కీళ్లకు కావలసినంత వ్యాయామం జరుగుతుంది. యోగసాధనకు ముందుగా శరీరాన్ని సిద్ధం చేసే ప్రక్రియలో గతవారాలలో మెడ, భుజాలు, గుండె కండరాలకు, ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని చాలన క్రియల గురించి తెలుసుకున్నాం. ఈ వారం వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. అలాగే  ఇవి ఎవరికి బాగా ఉపయోగపడతాయో చూద్దాం.

చికన్‌గున్యా, ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవాళ్లు ఒక వారం రోజుల పాటు ఈ ఆసనాలు చేస్తే అన్ని అవయవాలు స్వాధీనంలోకి వస్తాయి n చలికాలానికి ఇది చక్కటి యోగా n అన్ని ఆసనాలు చేయలేం అనుకున్న వృద్ధులు, బాగా వయసు పైబడినవారు ఈ తేలికపాటి అంగచాలనాలను లేదా సూక్ష్మ వ్యాయామాలను చేసి తరువాత ప్రాణాయామం చేసుకోవచ్చు n లేదా అన్ని ఆసనాలు చేయడానికి తగినంత సమయం లేని వారు కూడా త్వరగా తేలికగా పూర్తి అయ్యే ఈ అంగచాలనాలు చేసి ప్రాణాయామం చేసుకోవచ్చు. కేవలం 10 లేదా 15 నిమిషాలలో అన్ని అంగాలకు సాధన చేయవచ్చు n వీటి వలన శరీరంలోని కండరాలు అన్నింటికీ వ్యాయామం జరుగుతుంది. ఊపిరితిత్తులకు పనిచేసే శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసినంత ఆక్సిజన్‌ సరఫరా జరుగుతుంది. రక్త సరఫరా మెరుగవుతుంది. లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ అన్నిటికీ పనికి వస్తుంది. నడుము ఇంకా కింది భాగాలకు ఎటువంటి చాలనాలు చేయాలో గమనిద్దాం...

1. కటిచాలన (వేరియంట్‌ – ఎ)
రెండు కాళ్ళ మధ్య సుఖ పూర్వకమైన దూరం ఉంచి చక్కగా నిలబడి చేతులు రెండూ నడుముకు సపోర్ట్‌గా ఉంచి, నడుమును ఎడమపక్కకు, వెనుకకు, కుడి పక్కకు మళ్ళీ ముందుకు నెడుతూ నెమ్మదిగా రొటేట్‌ చేయాలి. 5 సార్లు గడియార దిశలో మరో 5 సార్లు అపసవ్వ దిశలో చేయాలి.
ఉపయోగాలు: డోర్సల్, లంబార్‌ స్పైన్‌కి, జీర్ణవ్యవస్థకు, మలవిసర్జన వ్యవస్థ, కిడ్నీలు, ఎడ్రినల్‌ గ్రంధులకు చక్కటి వ్యాయామం అందుతుంది.

2. కటిచాలన (వేరియంట్‌ – బి)
ఈ ఆసనాన్ని చేసేటప్పుడు మోకాళ్లను ముందుకు వంచి, చేతులు రెండూ నడుం పక్కన కాని లేదా భుజాల మీద కాని ఉంచి, రొటేట్‌ చేయాలి. 5 సార్లు గడియారం దిశలో, 5సార్లు అపసవ్య దిశలో చేయాలి.
ఉపయోగాలు: మోకాళ్లు వంచడం వలన సీటుభాగం మీద భారం పడుతుంది. గ్లూటియస్‌ మాక్సిమస్, పోడియస్‌ కండరాలకు బాగా ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. పొట్టదగ్గర నడుము పక్క భాగాలలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. సీటు వెనుకకు వెళ్ళినప్పుడు పొట్టను లోపలకు లాగడం, ముందుకు వెళ్లినప్పుడు పొట్టను ముందుకు పెట్టడం వలన కొవ్వు కరుగుతుంది. జీర్ణవ్యవస్థకి మంచిది. పీసీఓడీ సమస్యకి చాలా ఉత్తమం.రుతు సమస్యలు పరిష్కరింపబడతాయి. పెల్విస్‌ రీజియన్‌కి ఎక్సర్‌సైజు అవుతుంది. ఎడిపోజు టిష్యూలో కొవ్వు కరుగుతుంది.
- ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

- సమన్వయం ఎస్‌. సత్యబాబు
మోడల్‌: రీనా

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top