నేను శక్తి సిగ్నేచర్‌ సాంగ్‌

women empowerment : signature song - Sakshi

పాట పల్లవి: బిగిసిన పిడికిలిలో ఎగసిన కెరటాన్ని ముసిరిన చీకటిలో వెలిగే కిరణాన్ని నేనే నేనే శక్తి నేనే నేనే యుక్తి గర్భంలో తొలి యుద్ధం ఎదురీతకు నే సిద్ధం.

మధుసూదన రావు.. లిరిసిస్ట్‌.. నేను శక్తి సాం సాక్షి ‘నేను శక్తి’ పాట ని ప్రత్యేకంగా మహిళా ప్రాధాన్యత, మహిళా లోకం, మహిళా ప్రపంచం వంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాత్రలను పోషించే స్త్రీల గొప్పతనాన్ని వివరిస్తూ  రాయటం జరిగింది. ఈ పాట లోని ప్రతీ లైన్‌ ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ఈ పాటను నేను రాసినందుకు గర్వంగా ఉంది. ఒక మహిళకు మా మగవాళ్లు స్వేచ్ఛని ఇవ్వటం కాదు, మహిళలే తమంతటికి తాము స్వేచ్ఛను తీసుకునే దశకు మార్పు వచ్చింది. అది సమాజంలో అత్యద్భుతమైన మార్పుగా మనందరికీ కనిపిస్తుంది. దాన్ని మనం అందరం ‘నేను శక్తి’ పేరిట ఇలా సెలెబ్రేట్‌ చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది.  

శివ.. ఫిలిం మ్యూజిక్‌ డైరెక్టర్‌.. నేను శక్తి సాంగ్‌
ఆడవాళ్ళమీద, వారి ప్రాముఖ్యత, ప్రత్యేకత, విలువల మీద నన్ను మ్యూజిక్‌ కంపోజ్‌ చేయమన్నప్పుడు నాకు కాన్సెప్ట్‌ నచ్చింది.. మహిళల మీద నా గౌరవాన్ని తెలియజేసుకోవటానికి వారి మీద గౌరవంతో నా వంతు సాయంగా ఈ విధంగానైనా కతజ్ఞత తెలుపుకోవాలనే భావన తో ‘నేను శక్తి’ సాంగ్‌ కి మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాను.. ఈ పాట లోని పవర్ఫుల్‌ వైబ్రేషన్స్‌ కేవలం అది ఆడవాళ్లు ’శక్తి స్వరూపాలు’ అవ్వటం మూలానే అత్యద్భుతంగా వచ్చాయి. 

శమంత్‌.. (సింగర్‌)  నేను శక్తి ఎక్సక్లూసివ్‌ సాంగ్‌ 
జెనరేషన్స్‌ మారే కొద్దీ యువతలో.. ముఖ్యంగా అబ్బాయిల్లో సైతం ఆడవారి పట్ల గౌరవం పెరిగింది. అందుకు కారణం తల్లి తండ్రులే బాధ్యత తీసుకుని తమ కొడుకులకు సమాజంలోని ఆడవారి విలువలను తెలపటం అనే నేను భావిస్తున్నాను.. ప్రతి ఒక్కరిలో ఆడవాళ్ల పట్ల అక్క, చెల్లి, అమ్మ అనే భావన ఉంటేనే, అప్పుడే.. ఇంట్లో ఉన్న అమ్మ పైన ఉండే గౌరవం ఇతరేతర ఆడవారి పైన కూడా కలిగి అంతా ఒక కుటుంబం అనే పాజిటివ్‌ ఫీల్‌ లో ఉంటారు అబ్బాయిలు. దీని వలన మానవ సంబంధాలు, మానవ విలువలు పెరిగి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అంతరిస్తుంది. ఆడవాళ్లు మగవాళ్లు సమానం అనే మాట పాతది. మగవాళ్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అన్ని విషయాల్లో ఆడవారే ఉన్నారు, ఉంటారు. ఈ మాటను నేను గౌరవిస్తూ ఏకీభవిస్తున్నా అని చెప్పేందుకే నేను శక్తి అనే ఈ సాక్షి స్పెషల్‌ సాంగ్‌ కి మేల్‌ వెర్షన్‌ సింగర్‌ గా పాట పాడాను. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top