స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

జూలై 26న కార్గిల్‌ అమర వీరుల దినోత్సవం జరుపుకోడానికి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ను ఇవ్వడం కుదరదని లోకల్‌ మిలటరీ అ«థారిటీ (ఎల్‌.ఎం.ఎ) చెప్పడంపై అమరవీరుల భార్యలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే రోజున పెరేడ్‌ గ్రౌండ్‌లో వేరే కార్యక్రమాలు ఉండటంతో కార్గిల్‌ దివస్‌ కోసం పరేడ్‌ గ్రౌండ్‌ను కేటాయించలేమని ఎల్‌.ఎం.ఎ. చెప్పడం భావ్యం కాదని కార్గిల్‌యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన లాన్స్‌ నాయక్‌ రామ్‌చందర్‌ సతీమణి దివ్య ఆవేదన చెందారు
విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి, రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఫిన్లాండ్‌లోని భారతీయ రాయబారి వాణీరావు హైదరాబాద్‌ వచ్చారు. ఆమెతో పాటు పెరూ రాయబారి ఎం.సుబ్బారాయుడు, లావోస్‌ రాయబారి రవిశంకర్‌ ఐసోలా, సెషెల్స్‌ రాయబారి ఔసఫ్‌ సయీద్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహను కలిశారు
 షీ టీమ్స్‌కు నేతృత్వం వహిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ స్వాతీ లక్రా.. సామాజిక సేవా సంస్థ ‘రౌండ్‌ టేబుల్‌ ఆఫ్‌ ఇండియా’ ఇచ్చే ‘ఫ్రైడ్‌’ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ సంస్థ దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులను ప్రదానం చేస్తుంటుంది
 బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌కు వచ్చే నెలలో గానీ, ఆగస్టులో గానీ నిశ్చితార్థం జరగడానికి ఉన్న అవకాశాలను నిర్థారించేందుకా అన్నట్లు ప్రస్తుతం ఆ అమెరికన్‌ గాయకుడు ముంబైలోని ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి కనిపిస్తున్నారు. మరోవైపు ఇరవై ఐదేళ్ల నిక్‌ జోనాస్‌కు, ముప్పై ఐదేళ్ల ప్రియాంకను ఇచ్చి చెయ్యడంపై రెండు కుటుంబాల వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి మీడియా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది
 బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ భార్య కేట్‌ మిడిల్టన్‌.. మూడో బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలైనా దాటాయో లేదో, మళ్లీ ఆమె గర్భవతి అయిందని వార్తలు వస్తున్నాయి! రాజప్రాసాదానికి అత్యంత సన్నిహితులైన వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు.. కేట్‌ వదులైన దుస్తులు ధరిస్తూ, కూరలను అమితంగా ఇష్టపడుతూ, మార్నింగ్‌ సిక్‌నెస్‌ను పోగొట్టే ల్యావెండర్‌ బిస్కెట్లు తింటూ ఉన్నారు కనుక బహుశా ఆమె గర్భం ధరించి ఉండాలని బ్రిటన్‌ మీడియా అంచనా వేస్తోంది
 ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం సింహాసన వారసత్వాన్ని వదులుకోడానికి తను సిద్ధంగా ఉన్నానని జపాన్‌ రాకుమారి అయాకో ప్రకటించారు. జపాన్‌ ఇంపీరియల్‌ హౌస్‌హోల్డ్‌ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 27 ఏళ్ల అయాకో, కాలేజీలో తన స్నేహితుడైన  అతి సాధారణ పౌరుడు.. కీ మోరియా (32) ను అక్టోబర్‌ 29న వివాహమాడబోతున్నారు

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top