సంస్కృతుల హరివిల్లు!


మలేషియా ప్రభుత్వం 2014 సంవత్సరాన్ని ‘విజిట్ మలేషియా ఇయర్ 2014’గా ప్రకటించింది. ఈ సందర్భంగా 26 దేశాలనుండి 200కు పైగా మీడియా ప్రతినిధుల్ని జనవరి మొదటి వారంలో తమ దేశానికి ఆహ్వానించింది. జనవరి 4న మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల మధ్య, అబ్బురపరిచే సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కన్నులపండువగా మలేషియన్లు అత్యంత అభిమానించే ‘దాతారన్ మర్డేకా’ (ఇండిపెండెన్ ్స స్క్వేర్)’లో విజిట్ మలేషియా ఇయర్ 2014 అట్టహాసంగా  ప్రారంభమయింది.

 

మలేషియాకు స్వాతంత్య్రం 1957లో వచ్చింది. పదమూడు రాష్ట్రాలుగా, మూడు ఫెడరల్ టెరిటరీస్‌గా ఉన్న ఈ దేశ జనాభా మూడు కోట్లకు మించదు. స్థానిక మలై ప్రజలతోపాటు, చైనా, భారతదేశ ప్రజానీకం శతాబ్దాలుగా కలసి మెలసి జీవిస్తున్నారు. ఈ దేశజనాభాలో భారతీయుల జనాభా ఏడు శాతం. అందులో తమిళులదే సింహభాగం. ముస్లిం దేశమైనప్పటికీ ఆ ఛాయలెక్కడా కనిపించవు. దాదాపు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తూ కనిపిస్తారు. చూడాలేగానీ... పర్యాటక ప్రదేశాలకు కొదవలేదీ దేశంలో.

 

పెట్రొనాస్ టవర్‌‌స...

మలేషియా వెళితే కచ్చితంగా చూడాల్సింది ‘పెట్రొనాస్ టవర్‌‌స’ సరిగ్గా 451.9 మీటర్ల ఎత్తున ఉండే జంట టవర్లు.. ఈ రెండిటినీకలుపుతూ మధ్యలో స్కై బ్రిడ్‌‌జ.. 88 అంతస్తుల ట్విన్ టవర్‌‌సపై నుండి కౌలాలంపూర్ నగరాన్ని చూడటం ఓ అనిర్వచనీయమైన అనుభూతి!

 

కౌలాలంపూర్ టవర్... పెట్రొనాస్ టవర్‌‌సకి దీటుగా కనపడే మరొక కట్టడమిది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ టవర్ అయిన ఇది, మన జానపద కథల్లో ఒంటిస్తంభం మేడను గుర్తుకు తెస్తుంది.

 


పెటలింగ్‌స్ట్రీట్

 

ఇది మన సుల్తాన్‌బజార్! ఇక్కడ నాణ్యమైన వస్తువుల్ని చవకగా కొనేయొచ్చు. ఇవే కాకుండా నేషనల్ మ్యూజియం, కేఎల్‌సీసీ ఆక్వేరియం, ఇస్తానా బుదయా(నేషనల్ థియేటర్ ), 1858లో కట్టిన సెంట్రల్ మార్కెట్... ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి.

 

కేఎల్ బర్‌‌డ పార్‌‌క

బర్‌‌డ పార్‌‌క అనగానే నగరానికి ఎక్కడో దూరంగా అడవుల్లో ఉందనుకుంటే పొరపాటు. కౌలాలంపూర్ నడిబొడ్డున ఉన్న ఈ పక్షుల పార్‌‌క ప్రపంచంలోనే అతి పెద్దది!

 

పుట్రజయ

నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో విశాలమైన భవనాలు, ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు అన్ని ప్రభుత్వ ఆఫీసులు, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, ఉద్యోగుల గృహ సముదాయాలు... ఇలా ఎన్నో ఉన్నాయిక్కడ! సందర్శకులను ఆకర్షించడానికి ఓ కృత్రిమ సర స్సును కూడా నిర్మించారు.

 

సబా, సరావా    

మలేషియా ద్వీపకల్పాన్ని, సభా-సరావా రాష్ట్రాల్ని దక్షిణ చైనా సముద్రం విడదీస్తుంది. అక్కడికి వెళ్లాలంటే విమాన ం ఒక్కటే మార్గం. గంట ప్రయాణం. ప్రకృతి రమణీయత, ఆదీవాసీల జీవనశైలి, ప్రశాంత వాతావరణం, నాగరికత అంటని అమాయకత్వం... ఈ రాష్ట్రాల ప్రత్యేకత. ఇక్కడ మలై ప్రజానీకంతోపాటు 120 తెగల ఆదివాసి ప్రజలు ఉంటారు.

 

ఇంకా చూడాల్సినవి...

 పెరక్ రాష్ట్రంలో ఉన్న పాంకోర్ దీవి అందాలు చూడాల్సిందే. కామరూన్ హైల్యాండ్‌‌సలోని టీ తోటలు, దట్టమైన అడవులు, లోయలు, జలపాతాలు, గిరిజనులు.. నగర జీవిత హడావుడి నుంచి ప్రశాంతమైన వాతావరణంలోకి మనమూ, మన మనసూ రెండూ ప్రయాణిస్తాయి. నెగెరీ సెంబిలన్, మెలాకా రాష్ట్రాలు  ప్రాచీన కట్టడాలకు ప్రసిద్ధి. జోహర్ అందమైన బీచ్‌లకి ప్రతీక.

 

వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ రూపొందించిన ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించిన దేశాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలబడి, విజన్ 2020లో భాగంగా మొదటి స్థానాన్ని ఆక్రమించుకోవాలని ఉబలాటపడుతోన్న మలేషియా... ఆ స్థానానికి త్వరలోనే చేరుతుందనడంలో సందేహం లేదు!

 

 - ఎస్.గోపినాథ్‌రెడ్డి

 

 ఎలా వెళ్లాలి?

 మలేషియా ఎయిర్‌లైన్‌‌స, మరో రెండు మూడు భారతీయ విమాన సంస్థలు హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలను నడుపు తున్నాయి. హైదరాబాద్ నుండి కౌలాలంపూర్‌కు మూడున్నర గంటల ప్రయాణం. ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే చవకగానే దొరుకుతుంది. ప్రస్తుతం www.makemytrip.com అందిస్తున్న ప్యాకేజీ అన్నింటికన్నా చౌక. ఆ వివరాలు...

 

4 రాత్రుల ప్యాకేజీ-ఒకరికి రూ. 31,990, 3 రాత్రుల ప్యాకేజీ త్రీ స్టార్ హోటల్ అకామడేషన్ - ఒకరికి రూ. 29,000/-

 

 ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటే రూ. 250/- డిస్కౌంట్ లభిస్తుంది.

 

 ఎయిర్ ఏసియా టికెట్టు ధర రూ. 12,000/- ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

     

 టోల్ ఫ్రీ నెం: 1-860-500-5566 ను సంప్రదించగలరు.

 

 వెళ్లాక..?




 వెళ్ళగానే కరెన్సీ  (రూపాయి నుంచి రింగెట్‌లోకి) మార్చుకోవాల్సి వస్తుంది. దానికి గైడ్ సహాయం తీసుకుంటే, ఎక్కడ మంచి ధర వస్తుందో చెబుతారు.

     

 స్థానిక మొబైల్ సిమ్ కొనుక్కుంటే మంచిది. పాస్‌పోర్‌‌ట చూపించగానే ఇస్తారు.

     

 పబ్లిక్ ట్రాన్‌‌సపోర్‌‌ట చాలా సౌకర్యంగా ఉంటుంది. మెట్రో, మోనో రైళ్ళకి తోడుగా,    

 సిటీ బస్సులు కూడా ఎక్కువే. టాక్సీలు మీటర్‌పైనే వస్తాయి.

     

 ఇండియన్ రెస్టారెంట్లు, సౌత్‌ఇండియన్ హోటళ్లుకూడా ఎక్కువే. ఇడ్లీ సాంబార్ నుండి హైదరాబాద్ బిర్యానీ వరకూ అన్నీ దొరుకుతాయి. అయితే రోడ్‌సైడ్ ఫుడ్ రుచి చూడటం మరిచిపోవద్దు. నిజమైన మలేషియా అక్కడ కన పడుతుంది.

      

 సంవత్సరం పొడవునా సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. వర్షాలు మాత్రం ఎక్కువే.

 

 కంపుంగ్ బారు




 మలేషియా అధికారభాష మలైలో దీనర్థం ‘కొత్త గ్రామం’! అలా అని సరికొత్త ఊరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. సరిగ్గా 110 సంవత్సరాల చరిత్ర ఉన్న వేయి కుటుంబాల ఈ చిన్న ఊరు ఇది! కూతవేటు దూరంలో ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద బిల్డింగ్ ’’పెట్రొనాస్ టవర్‌‌సచీచీ... మరోపక్క మరో అతిపెద్ద నిర్మాణం  ’కెఎల్‌టవర్‌చీ... వాటి చుట్టూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్టు ఉండే స్కైస్క్రేపర్‌‌స... ఇంత ఆధునిక కట్టడాలు, వేగంగా మారుతున్న ప్రజల అభిరుచుల మధ్య ’’కంపుంగ్ బారుచీచీతన ఉనికిని, అస్తిత్వాన్ని అలాగే నిలబెట్టుకోవడం విశేషం!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top