రేపేనా! పెళ్లి?

virat and anushka marriage tomorrow? - Sakshi

ఈ నెలలో ఇండియాకు పెద్ద ఈవెంట్‌ ఉంది. అయితే ఆ ఈవెంట్‌ జరుగుతున్నది ఇటలీలో! ఇదంతా కూడా.. ఇప్పుడు వింటున్న రూమర్లు నిజం అయితేనే. అనుష్క–విరాట్‌ల పెళ్లి కోసం దేశం ఎప్పటినుంచో చూస్తోంది. ఈ డిసెంబర్‌ 9న గానీ, లేదా 10, 11 తేదీల్లోగానీ పెళ్లి జరగొచ్చని ఇప్పటికి ఓవరాల్‌ కంట్రీ ఓ ఎస్టిమేషన్‌కి వచ్చింది! విరాట్‌ మ్యాచ్‌ను గెలిపిస్తాడో లేదో అంచనా వెయ్యొచ్చు. అనుష్క యాక్ట్‌ చేసిన మూవీ హిట్‌ అవుతుందో లేదో అసెస్‌ చెయ్యొచ్చు. బట్‌ వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికైనా మూడు డేట్‌లు బయటికి వచ్చాయి. బహుశా మూడు రోజుల పెళ్లి అయి ఉంటుంది. డిసెంబర్‌ 10 నుంచి లిమిటెడ్‌ సిరీస్‌తో భారత్‌ శ్రీలంకతో ఆడబోతోంది.

అందులో విరాట్‌ కోహ్లీ లేడు! రెస్ట్‌ కోసం అని కొంచెం బ్రేక్‌ తీసుకున్నాడు. రెస్టు కోసం కాదు, పెళ్లిబంధంలో అరెస్ట్‌ అవడానికి అతడు బ్రేక్‌ తీసుకున్నాడని ఇంకో గుసగుస. 2013 నుంచి ఈ జంట ప్రేమించుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో విరాట్‌ అప్పుడప్పుడు పోస్ట్‌ చేస్తుండే.. ఫొటోలు చూస్తుంటే.. అత్తగారింటితోనే విరాట్‌కు చక్కటి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేనా! విరాట్‌ ఏ రోజైనా అనుష్క మీద విమర్శల బౌన్సర్‌ను పడనిచ్చాడా? ఆమె వల్లే అతడు ఓడిపోతున్నాడు అన్న కామెంట్‌ వచ్చినప్పుడు... ‘అలా అనకండి. ఆమె నా బలం’ అని సపోర్ట్‌ ఇచ్చాడు. ఇదీ ప్రేమంటే. ఇక పెళ్లెప్పుడు జరిగితే మాత్రం ఏముంది?
 సమర్పణ: నూరు దడవై

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top