వారఫలాలు : 29 అక్టోబర్‌ నుంచి 4 నవంబర్‌ 2017 వరకు

Varaphalalu: from 29 October to 4 November 2017

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. శుభకార్యాలపై ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి కాస్త బయటపడతారు. రాబడి ఆశాజనకంగా ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయం దర్శించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ప్రారంభంలో కొంతవరకూ చికాకులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వివాదాలు. ఎరుపు, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు నిదానంగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక విషయాలు ఆశాజనంగా ఉంటాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. రాజకీయవేత్తల ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వíß ంచి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, లేత గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు,ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.  వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు శుభవార్తలు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఎనలేని గౌరవం. మీ సత్తా చాటుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపుతో పాటు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం.  గులాబి, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top