వారఫలాలు : 22 అక్టోబర్‌ నుంచి 28 అక్టోబర్‌ 2017 వరకు

Varaphalalu: from 22 October to 28 October 2017

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
వ్యూహ ప్రతివ్యూహాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. శుభకార్యాలు, దైవకార్యాల నిర్వహణపై చర్చలు ఫలిస్తాయి. కొత్త గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీదపడతాయి. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి కొంత సహాయం సైతం అందుతుంది.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం, అనుకూల ఫలితాలు సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌వర్గాలకు శుభసూచకాలే. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పట్టుదలతో  అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగల అవకాశం. కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రాబడి సంతృప్తినిస్తుంది. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీసత్తా చాటుకునేందుకు తగిన సమయం. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితి ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవార్డులు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. లేత నీలం, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. క్రమేపీ మీకు ఎదురులేని పరిస్థితి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top