వారఫలాలు : 12 నవంబర్‌ నుంచి 18 నవంబర్‌ 2017 వరకు

Varaphalalu: 12 November until 18 November 2017 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యకార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణాలయంలో తులసీ అర్చన చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రో ణి, మృగశిర 1,2 పా.)
పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పూర్తి కాగలవు. రావలసిన బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనయోగం. ముఖ్య వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు వ్యూహాలలో విజయం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రులతోవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. తెలుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సా«ధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రులతో మాటపట్టింపులు. లేత నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకునికి అభిషేకం చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలలో విజయం సా«ధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. నేరేడు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు పూలతో దుర్గామాతకు అర్చన చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి పట్టింది బంగారమే. ఆర్థిక విషయాలలో కొత్త ఆశలు. బంధువులు మీపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు కొనుగోలుట. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. సన్నిహితులతో నెలకొన్న వివాదాలు కొంత సర్దుబాటు కాలగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. శ్రమాధిక్యం. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. వేడుకలకు హాజరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవర్గాలకు పదవులు రాగలవు. వారం మధ్యలో ఖర్చులు. ఆస్తి వివాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top