ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటున్నారా...

Using online services ... - Sakshi

సెల్ఫ్‌ చెక్‌

ఇంటర్నెట్‌ పుణ్యమాని సులభంగా   పనులు చక్కబెట్టుకునే రోజులు వచ్చేశాయి. ప్రజలకు అందిస్తోన్న సేవలను మరింతగా వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పలు  ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నాయి.. ఇలాంటి  సౌకర్యాన్ని అందుకోలేకపోతే ఆ తప్పు మనదే. ఆన్‌లైన్‌ ద్వారా అందుతున్న సేవలపై మీకు  అవగాహన ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోండి.

1.    రైల్వే, బస్సు టిక్కెట్ల వంటివి ఆన్‌లైన్‌లో ముందుగా బుక్‌ చేసుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

2.    తిరుపతి వంటి రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో గదులు, దర్శనం టిక్కెట్లు... ఆన్‌లైన్‌ద్వారా కేటాయిస్తారని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

3.    ఎల్‌ఐసి చెల్లింపులు, బ్యాంక్‌ లావాదేవీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

4.    ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలని అనుకోరు. 
    ఎ. అవును     బి. కాదు 

5.    నగదు సంబంధమైన ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం క్రెడిట్‌ కార్డ్‌ అవసరమని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

6.    మీకు ఇష్టమైన, నచ్చిన ప్రముఖ సంస్థల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి కొనుగోలు చేస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

7.    దినపత్రికలు విడిగా అందుబాటులో లేనపుడు వాటి ఆన్‌లైన్‌ ఎడిషన్లలో వార్తలు తెలుసుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

8.    ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా, ఇంటర్నెట్‌ కెఫెలకు వెళ్ళి  ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

9.    వేరే ఊరు, దేశంలో ఉన్నవారికి కూడా ఆన్‌లైన్‌ ద్వారా బహుమతులు, శుభాకాంక్షల సందేశాలు... వంటివి పంపవచ్చునని మీకు తెలుసు.
    ఎ. అవును     బి. కాదు 

10.    మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రభుత్వ కార్యాలయానికి, సంబంధిత విభాగాన్ని గురించి తెలుసుకోవడానికి ముందుగా ఆన్‌లైన్‌లో Ðð దుకుతారు.
    ఎ. అవును     బి. కాదు 

పై ప్రశ్నలకు సమాధానాలుగా ‘ఎ’ లు ఏడుకన్నా ఎక్కువ వస్తే మీకు ఆన్‌లైన్‌ సేవలపై అవసరమైనంత అవగాహన ఉంది. అలా కాకుండా ‘బి’లు ఎక్కువ వస్తే...మీకు ఇంటర్నెట్‌ అందిస్తున్న అత్యంత ఉపయుక్తమైన సేవలపై పరిజ్ఞానం సరిపడాలేదు. తద్వారా సులభంగా కావాల్సిన ఎన్నో పనులకు మీరు అనవసరంగా కష్టపడుతున్నారు. కాబట్టి మీరు ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించిన  పరిజ్ఞానం దశలవారీగానైనా పెంచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. దాని వల్ల మీరు అనూహ్యమైన ప్రయోజనాలు పొందవచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top