ఇంటిప్స్
♦ కీర దోస, బీర కాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే వాటిని మధ్యలోకి విరిస్తే చేదుబారవు.
♦ తేనె స్వచ్ఛత తెలియాలంటే, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె వేయాలి. నీటిలో కరగకుండా అడుగుకు చేరితే అది మంచి తేనె.
♦ ఉప్పు నీటికోసం నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు కలపాలి. ముందే ఉప్పు వేస్తే మరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
♦ వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే నీటిలో నానబెట్టాలి.
♦ అప్పడాలను పాలిథిన్ కవర్‌లో పెట్టి పప్పులు, బియ్యం డబ్బాలో పెడితే విరిగి పోకుండా ఉంటాయి.
♦ కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి పొడి లేదా గసాల పొడి చల్లాలి. అలాగే కొబ్బరి ముక్కలను కూరలో వేసి పదిహేను నిమిషాల తర్వాత తీసివేయాలి. ఎక్కువైన ఉప్పుని కొబ్బరి ముక్క పీల్చుకుంటుంది.
మరిన్ని వార్తలు