ధర్మజిజ్ఞాస

దీపావళికి రెండురోజుల ముందువచ్చే ధనత్రయోదశి నాడు వెండి బంగారాలను కొంటే ఐశ్వర్యం పెరుగుతుందా? – భాష్యం ధరణి, గుంటూరు
ఆశ్వయుజ మాసంలో మొదటి పదిరోజుల్లో పార్వతీదేవినీ, మూలా నక్షత్రం నాడు సరస్వతినీ పూజించాం. ఇక త్రిమూర్తుల భార్యల్లో పూజ జరగకుండా మిగిలిన లక్ష్మీదేవికి మూడురోజుల పాటు – అంటే – ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళినాడు పూజ చేయాలని చెప్పదలిచింది శాస్త్రం. లక్ష్మీపూజని ప్రారంభించే రోజుని ‘ధనత్రయోదశి’ అని గుర్తుంచుకోవాలి. అయితే ధనత్రయోదశి/అక్షతదియల్లో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొని ఊరుకుంటే సరిపోదు. దేవతల వైద్యుడు, ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరిని కూడా పూజించాలి. దీపాలు వెలిగించాలి.
 

దీపావళినాటి స్నానానికి గొప్పదనం ఉందంటారు నిజమా? – ఈదర శ్రీమణి, గొల్లలమామిడాడ
నరకచతుర్దశి, దీపావళి తెల్లవారుజామున మాడు (శిరసు మధ్య భాగం) మీద తల్లి నువ్వులనూనెని అద్ది అక్షతలు వేస్తూ ఆశీర్వదించాలి. ఆ మీదట శరీరం నిండుగా తైలం (నువ్వుల నూనె మాత్రమే) రాసుకుని ఓ గంట నానిన తరవాత సున్నిపిండితో నలుచుకుని స్నానం చేస్తే రోమకూపాలన్నీ తెరుచుకుని శరీరంలోని వ్యర్థాలు రోగకారక్రిములూ స్వేదరూపంగా బయటికి పోతాయి. ఇది వైద్యపరంగా. ఇక ఆధ్యాత్మికంగానైతే నువ్వులనూనెలో లక్ష్మీదేవి, స్నానం చేసే నీటిలో గంగమ్మ ఈ రెండ్రోజుల్లో అధివసించి ఉంటారు. (తైలే లక్ష్మీః జలే గంగా) నూనె పెట్టేందుకు తల్లి లేకుంటే భార్య నూనెను పెట్టాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top