ఉద్యోగ యత్నాలు ఫలించడం లేదా?

useful information - Sakshi

కొందరు బాగానే చదువుకుని ఉంటారు. ఉన్నత విద్యార్హతలు సాధించి ఉంటారు. పోటీ ప్రపంచంలో కావలసినవన్నీ ఉన్నా ఉద్యోగం దొరకడం గగనమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నా ఫలితం కనిపించక నిరాశలో కూరుకుపోతుంటారు. ఉద్యోగయత్నాలు సఫలం కావాలంటే..

సూర్యుడిని ఆరాధించండి. ఏదైనా ఆదివారం రోజున ప్రారంభించి, ప్రతిరోజూ ఆదిత్య హృదయం  పఠనం కొనసాగించండి. ఇలా ఆరు వారాలు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది.
ఆదివారం రోజున ఉదయం వేళ నన్నారి (సుగంధి పాల చెట్టు) వేరును సేకరించి, శుభ్రం చేసి, పూజలో ఉంచండి. మరునాడు దానిని ఒక తాయెత్తులో ఉంచి, ఎరుపుదారంతో మెడలో ధరించండి.
ఏదైనా గురువారం రోజున గోవులకు గోధుమ రొట్టెలు, నానబెట్టిన శనగలు తినిపించండి. అలాగే, ప్రవహించే నీటిలో చిన్న బెల్లం ముక్కను విడిచిపెట్టండి. ఇలా పదహారు వారాలు పాటించాల్సి ఉంటుంది.
♦  ఏదైనా సోమవారం శివాలయాన్ని దర్శించుకుని, శివలింగానికి చెరకురసంతో అభిషేకం జరిపించండి. ఇలా వరుసగా పదకొండు వారాలు చేయాలి.
♦  ప్రతిరోజూ ఉదయం వేళ కాకులకు నల్ల నువ్వులు కలిపిన అన్నం ముద్దలను ఆహారంగా వేయండి. ఆ తర్వాతనే అల్పాహారం తీసుకోండి.

– పన్యాల జగన్నాథదాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top