రారండోయ్‌ 

Telugu Literature Events In Telangana And Andhra Pradesh - Sakshi
  • ఈ.రాఘవేంద్ర కవిత్వ సంపుటి ‘గాయపడ్డ విత్తనం’ ఆవిష్కరణ ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని టవర్‌క్లాక్‌ దగ్గరి ఎన్జీవో హోమ్‌లో జరగనుంది. ఆవిష్కర్త: మేడిపల్లి రవికుమార్‌. అధ్యక్షత: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.
  • డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్‌ ట్రస్ట్, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం ఆధ్వర్యంలో – భూతపురి 17వ సాహిత్య పురస్కార ప్రదానం ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడపలో జరగనుంది. గ్రహీత: ఆచార్య రాణి సదాశివమూర్తి. ముఖ్య అతిథి: అత్తిపల్లి రామచంద్రారెడ్డి.
  • అరుణ్‌ సాగర్‌ వర్ధంతి సభ ఫిబ్రవరి 12న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. నిర్వహణ: అరుణ్‌ సాగర్‌ మిత్రులు, కుటుంబ సభ్యులు.
  • తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కందుకూరి శతవర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ‘వీరేశలింగం సాహిత్యం– సామాజిక దృక్పథం’ అంశంపై జాతీయ సదస్సు జరగనుంది. కీలకోపన్యాసం: డాక్టర్‌ బూదాటి వెంకటేశ్వర్లు.
  • కొలకలూరి భాగీరథి పురస్కారానికి బిక్కి కృష్ణ ‘కవిత్వం–డిక్షన్‌’(విమర్శ), కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారానికి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి ‘నుడి గడి’ (పరిశోధన) ఎంపికైనాయని నిర్వాహకులు కొలకలూరి మధుజ్యోతి, కొలకలూరి సుమకిరణ్‌ తెలియజేస్తున్నారు. ప్రదానం ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో.
  • బండారి రాజ్‌ కుమార్‌కు 2018 సంవత్సరానికిగాను కలకత్తా భారతీయ భాషా పరిషత్‌ యువ పురస్కారం లభించింది. మార్చి 15, 16 తేదీలలో కలకత్తాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరిస్తారు. రాజ్‌ కుమార్‌ గరికపోస, నిప్పుమెరికెలు, గోస, వెలుతురు గబ్బిలం కవితా సంపుటాలు ప్రచురించారు.
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top