పూల కొప్పులు
కొప్పు వేయడమంటే వయసు పైబడినట్టు కనిపిస్తారనే అపోహ ఉండేది నిన్నామొన్నటి వరకు. ఇప్పుడు వేడుకలలో ఇదే ఫ్యాషన్‌ అయ్యింది. వధువుతో సహా అమ్మాయిలు అందమైన కొప్పును ఎంతో ముచ్చటపడి మరీ ముడుచుకుంటున్నారు. ఆ కొప్పున మల్లెలు తురుముకుంటున్నారు. అందుకేనేమో, అమ్మాయిలు మూతి ముడిచినా అందమే, కురులు ముడిచినా చందమే! అంటున్నారు అంతా!

వేడుకలు వస్తే కురులను గాలికొదిలేసి అదే సై్టల్‌ అనడం ఓల్డ్‌ ఫ్యాషన్‌ అంటున్నారు ఈ తరం భామలు. అందుకే ఒద్దికగా కురులను ముడిచి, వాటిని బంగారంతో సింగారిస్తున్నారు. పువ్వులతో అలంకరిస్తున్నారు. సంప్రదాయ వస్త్రాలంకరణకు అసలు సిసలైన కేశాలంకరణగా చిన్నా పెద్ద మెప్పు కొట్టేస్తున్నారు. చూపులను కొల్లగొట్టేస్తున్నారు. వేడుకలలో చూపరుల మతులు పోగొట్టే పూల కొప్పులు ఇవి.

Back to Top