చర్మ సౌందర్యంకోసం...

For skin aesthetic - Sakshi

చలికాలం మొదలవడంతో ఒళ్లు పగిలిపోవడం, ఎండినట్లు అవ్వడం జరుగుతుంది. ఇంట్లో లభించే  సౌందర్య సాధనాలతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని చర్మాన్ని సంరక్షించుకోవచ్చు...
శనగపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు సమపాళ్లలో తీసుకుని, ఛాయపసుపు కొమ్ములు గుప్పెడు, గంధ కచూరాలు గుప్పెడు, ఎండబెట్టిన గులాబీ రెక్కలు కొన్ని కలిపి గ్రైండ్‌ చేసి పొడి చెయ్యాలి. ఈ పొడిని  కొద్దికొద్దిగా తీసుకుని పెరుగులో కాని, మజ్జిగలోకాని, పాలలో గాని కలిపి, సబ్బుకి మారుగా ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి స్నానం చేస్తే ఒళ్లు పేలిపోకుండా ఉండడమే కాకుండా చర్మం నునుపు తేలి  సువాసన వెదజల్లుతుంది.

స్నానం చేసే ముందు నువ్వుల నూనె ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మం పగిలిపోదు. సబ్బుకి బదులుగా పాలలో పెసర పిండిని కలిపి ఒంటికి పట్టించి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ని గాని బాడీ లోషన్‌గాని అప్లై చేయడం మరచిపోవద్దు.

చేతులు పాదాల రక్షణకు...
చలికాలం ప్రభావం  చేతులు, పాదాల మీద ఎక్కువగా ఉంటుంది. చర్మ సంరక్షణలో భాగంగా కొద్దిపాటి జాగ్రత్తలు పాదాలు, చేతుల మీద కూడా తీసుకుంటే సరిపోతుంది. స్నానం చేసిన తరువాత, బాడీలోషన్‌ని, అలాగే పడుకోబోయే ముందు కూడా కాళ్లూ, చేతులని శుభ్రంగా కడిగి తుడిచిన తరువాత వైట్‌ పెట్రోలియం జెల్లీగాని, మాయిశ్చరైజర్‌ గాని పట్టించాలి. ప్రతిరోజు రెండుసార్లు క్రమం తప్పకుండా ఈ చిన్న జాగ్రత్త పాటిన్తే కాళ్లూ, చేతులకి పగుళ్ల సమస్యలుండవు.

ఇంటిపని చేసిన తరువాత పాదాలు, చేతులు పొడిబారిపోయి, పగుళ్ల బారిన పడతాయి. అందుకని తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌తోగాని, కోల్డ్‌ క్రీమ్‌తోగాని చేతుల్ని అయిదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేస్తే వేళ్ల చివర్న పగుళ్లని అరికట్టవచ్చు. ఇరవై రోజులకొక్కసారి పాదాలకి పెడిక్యూర్, చేతులకి మెనిక్యూర్‌ చేసుకోవడం తప్పనిసరి. వైట్‌ పెట్రోలియం జెల్లీ, మాయిశ్చరైజర్‌ సమపాళ్లలో కలిపి పాదాలకు, చేతులకూ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చలిగా ఉన్నప్పుడు బయటికి వెళ్లాల్సివస్తే పాదాలకి సాక్స్‌ వేసుకుని వెళ్తే పగుళ్లబారి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బయటకి వెళ్లినప్పుడు హేండ్‌ బ్యాగ్‌లో కోల్డ్‌ క్రీమ్‌ని వేసుకుంటే బెటర్‌. ఖాళీగా ఉన్నపుడు మర్దనా చేసుకుంటే చేతులు పొడిబారవు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top