త్రీడీ సెల్ఫీలండోయ్...

త్రీడీ సెల్ఫీలండోయ్...


స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు తీసుకోవడం మీకు కొత్త కాకపోవచ్చుగానీ... త్రీడీలో ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే... అచ్చంగా మీ రూపురేఖలతో కూడిన విగ్రహాలనెప్పుడైనా ప్రింట్ చేసుకున్నారా? అని. లేదంటే చలో బెంగళూరు! మంత్రిమాల్‌లోని ‘క్లోన్ మీ’ స్టూడియోకు వెళితే సరి. ఎంచక్కా ఒక అడుగు ఎత్తున్న మీ విగ్రహాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. యువ ఇంజినీర్ సిద్ధార్థ రాథోడ్ , కమలేష్ కొఠారీల ఈ ఐడియా బెంగళూరులో ఇప్పటికే సూపర్‌హిట్. ముందస్తు అపాయింట్‌మెంట్‌తో ఈ షాపుకు వెళ్లాల్సి ఉంటుంది.అక్కడ మీ ఫొటోలు, త్రీడీ స్కాన్లను తీసుకున్న తరువాత డిజైన్‌టీమ్ అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తుంది. ఆ తరువాత ప్రోజెట్ ఎక్స్ 360 త్రీడీ రంగంలోకి దిగుతుంది. ప్రత్యేకమైన పదార్థం, లక్షల రంగుల కాంబినేషన్లను ఉపయోగించుకుంటూ మీ విగ్రహాన్ని తయారు చేస్తుందన్నమాట. ఇలా ప్రింట్ అయిన బొమ్మలను కొందరు మోడళ్లు తమ ప్రొఫైల్స్ కోసం కూడా వాడుకుంటున్నారట. ఒక్కో త్రీడీ ప్రింట్ కనీస ధర రూ.999 వరకు ఉంటుందని మోడల్‌నుబట్టి ధర మారిపోతుందని సిద్ధార్థ్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://www.cloneme.in/ వెబ్‌సైట్‌ను చూడండి.

Back to Top