కొంటె కోణంగి రాతలు

Sahitya Maramaralu About Telugu Writers - Sakshi

సాహిత్య మరమరాలు

లైబ్రరీ పుస్తకాల మీద కొక్కిరాయిలు రాసే కోణంగి రాతలు ఇలా ఉంటాయి.

కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవల పేరు కింద– చదువుతాము సార్‌! అందుకేగా ఇక్కడికి అఘోరించాం.

‘మహాప్రస్థానం’ మధ్యపేజీలో– శ్రీశ్రీ నీ తల ఎండిందోయ్‌ ఎర్రగా!

తాతాజీ(తాపీ ధర్మారావు) ‘ఇనప కచ్చడాలు’ పుస్తకంపై– ఇది తెలుగు సరస్వతికి సిగ్గుబిళ్ళ.

‘చివరకు మిగిలేది’– లైబ్రరీలో.

‘మైదానం’ మొదటి పేజీపై– గుడిపాటి వెంకటచలేయ, విషయ పరిజ్ఞాన ధురీణ, అరుణాచల మైగ్రేయ! అభివాదయే!

ఒక పుస్తకంలో శివశంకర దీక్షితులు రాసిన పీఠిక పెద్దగా ఉంటే– లుంగీ అంగీని మింగేసింది స్వామీ!

ఒక విమర్శనా గ్రంథం లోపలి అట్టపేజీపై– దీనికి అట్ట తీసేస్తే ఆయుర్వేదం కేటలాగు అనుకోగలరు, కనుక అట్ట భద్రం.

దాశరథి ‘అగ్నిధార’– దీనికి ఒక మూల చెదలు పట్టింది, గమనించగలరు.   

రావిశాస్త్రి ‘రాజు – మహిషి’– వీరి నవలల్లో వెరసి నాలుగు పాత్రలు, నిండా ఉపమా.

‘కృష్ణపక్షం’ – దేవులపల్లి కృష్ణశాస్త్రి బద్ధకం అంటూనే బండెడు రాస్త్రి.

(శ్రీరమణ ‘శ్రీ చానల్‌’ నుండి)
సేకరణ: కోడీహళ్లి మురళీమోహన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top