ఎక్కడో చిన్న తేడా వచ్చింది!

Sahitya Maramaralu - Sakshi

సాహిత్య మరమరాలు
ఒద్దిరాజు సోదరులుగా పరిచితులు ఒద్దిరాజు సీతారామచంద్రారావు, ఒద్దిరాజు రాఘవరంగారావు. కవులుగా, నాటకకర్తలుగా, దార్శనికులుగా వీరి జీవితం ఆదర్శప్రాయమైనది. ఇద్దరిలోనూ చిన్నవాడైన రాఘవరంగారావు మంచి హాస్యాన్ని పండించేవారు.

అన్నదమ్ములిద్దరూ ఏదో పనిమీద ఓసారి మద్రాసుకు వెళ్లారు. అక్కడో సత్రంలో దిగారు. ఓరోజు వారున్న చోటికి ఒక అత్తర్లు అమ్ముకునే వ్యాపారి వచ్చాడు. వీళ్లు సీసాలు కొన్నారు. వాళ్లకున్న సహజమైన కుతూహలంతో ఆ అత్తర్ల మనిషితో సంభాషిస్తూ, వాటిని ఎలా తయారు చేస్తారు? వాటికి ఏమేం కావాలి? లాంటి వివరాలు రాబట్టారు.

ఇక, వాళ్ల ఊరైన ఇనుగుర్తికి తిరిగి వచ్చేటప్పుడు అత్తరు తయారీకి కావాల్సిన సరంజామా అంతా మరిచిపోకుండా కొన్నారు. వచ్చాక వాళ్ల పద్ధతిలో తయారీ కసరత్తు చేశారు. మొత్తానికి అత్తరు తయారైంది. దానికో పేరు పెట్టాలి కదా! ‘మురికొళుందు’ అని నామకరణం చేశారు. అదేం పేరు? అని ఇంట్లోవాళ్లు అడిగితే, ‘మద్రాస్‌ వాళ్లు పెట్టిన పేరు మరికొళుందు, అంటే మంచి వాసన. మరి మేము చేసినది మురికొళుందు, అంటే మురుగు వాసన’ అని  రాఘవరంగారావు చెప్పగానే అందరూ నవ్వేశారట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top