సాహితీ దీపికలు

Sahiti Deepikalu Book Introduction - Sakshi

పుస్తక పరిచయం
‘మౌనం పరిణతి చెందిన జ్ఞానానికి సంకేతం’ అంటారు అరుణావ్యాస్‌. అలాగని మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి! ‘న్యాయమూ అన్యాయమూ నాణానికి రెండు వైపులు. న్యాయాన్ని రక్షించి, అన్యాయాన్ని అడ్డగించడం ప్రతివాళ్ల కర్తవ్యం’ అని హితబోధ చేస్తారు. ‘సంప్రదాయం పట్ల గౌరవం, అభ్యుదయకరమైన ఆధునికత పట్ల సమాదరణం’ గల అరుణావ్యాస్‌ 1986–87 నుంచి ఆకాశవాణి భావన కార్యక్రమంలో చేసిన 21 లఘుప్రసంగాలను ‘నవచేతన’ పుస్తకంగా తెచ్చింది. ‘మానవ జాతి ఉనికిని కాపాడి, అవిచ్ఛిన్నంగా సాగిపోయేట్టు చేసే’ స్త్రీ మీదా, మమతల కోవెల లాంటి ‘చల్లటి, కమ్మటి కుటుంబ వ్యవస్థ’ మీదా, ‘సంగీతానుకూలత ఎక్కువ’ అంటూ తెలుగు భాష మీదా, ‘నియంత్రించుకోగలవానికి శత్రువంటూ ఉండడు’ అంటూ కోపం మీదా చేసిన ‘భావనా బలిమి’ గల ప్రసంగాలివి.

రచన: డాక్టర్‌ కె.అరుణవ్యాస్‌
పేజీలు: 62; వెల: 40;
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్‌ హౌస్,
జి.ఎస్‌.ఐ. పోస్టు,
బండ్లగూడ (నాగోల్‌),
హైదరాబాద్‌–68.
ఫోన్‌: 24224453

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top