రోబో డాక్టర్‌!

Robotics tested for the licenses to practice and sank in the first class. - Sakshi

పరిపరిశోధన

కృత్రిమ మేధ పుణ్యమా అని ఇప్పుడు రోబోలు బోలెడన్ని పనులు చేసేస్తున్నాయి. తాజాగా చైనాలోని ఓ కంపెనీ తయారు చేసిన రోబో ఏకంగా డాక్టర్‌ లైసెన్స్‌ కూడా సంపాదించింది. దీని పేరు షియావీ. నిన్నమొన్నటి వరకూ కృత్రిమ మేధ రోబోలు చదరంగం బాగా ఆడేవి.. గో అనే క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌లను ఓడించేవి. కొన్నిచోట్ల బాగా వంట కూడా చేసేవి. కానీ షియావీ ఇంకో అడుగు ముందుకేసింది. చైనాలో వైద్యులు ప్రాక్టీస్‌ చేసేందుకు ఇచ్చే లైసెన్సుల కోసం నిర్వహించిన పరీక్షలు రాసి ఫస్ట్‌క్లాస్‌లో పాసైపోయింది. ఐఫ్లైటెక్‌ అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో రోగి సమాచారం మొత్తాన్ని గ్రహించి, విశ్లేషించి మరీ ఏ రకమైన వైద్యం అందించాలన్నది నిర్ణయిస్తుందని చైనా పత్రికలు తెలిపాయి.

అయితే ఈ రోబో ఇప్పటికప్పుడు క్లినిక్‌ పెట్టేసి వైద్యం చేయడం మొదలుపెట్టదని ప్రస్తుతానికి దీన్ని వైద్యులకు సహాయకారిగా ఉండేందుకు మాత్రమే ఉద్దేశించిందని ఐఫ్లైటెక్‌ కంపెనీ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను నివారించేందుకు, తక్కువ సమయంలో ఎక్కువమందికి వైద్యం అందించేందుకు షియావీ ద్వారా ప్రయత్నిస్తామని అంటున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top