పగడపు దిబ్బలపైనా  ప్లాస్టిక్‌ పడగ

Plastic hood on coral reefs - Sakshi

ప్లాస్టిక్‌ కాలుష్యం... భూమి మీద నీరు మట్టిని మాత్రమే కాకుండా సముద్రాల్లోని పగడపు దిబ్బలపై కూడా దుష్ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్‌తోపాటు పగడపు దిబ్బలకు చేరుతున్న బ్యాక్టీరియా వాటికి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయని చివరకు వాటిని చంపేస్తున్నాయని కార్లెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త  జోలే లాంబ్‌ అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, మయన్మార్, థాయ్‌లాండ్‌లలో లక్షకుపైగా పగడపు దిబ్బలను పరిశీలించిన  తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని జోలే చెప్పారు.

ప్రాంతాన్ని బట్టి కాలుష్యం తీవ్రత మారిందని, ఇండోనేసియాలో ప్రతి వంద చదరపు అడుగుల దిబ్బకు 26 వరకూ ప్లాస్టిక్‌ ముక్కలు కనిపించగా.. ఆస్ట్రేలియాలో ఇది ఒకటి కంటే తక్కువగా ఉందని వివరించారు. ఆసియా పసఫిక్‌ ప్రాంతంలోని పగడపు దీవులు మొత్తం మీద దాదాపు 1110 కోట్ల ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నట్లు అంచనా. పరిస్థితిని వీలైనంత తొందరగా చక్కదిద్దకపోతే పగడపు దిబ్బలు అంతరించిపోయేందుకు ఎక్కువ సమయం పట్టదని హెచ్చరించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top