మతం కాదు... మానవ ధర్మం

మతం కాదు... మానవ ధర్మం - Sakshi


ఆత్మీయంబౌద్ధం మతమా లేక దర్శనమా? అని చాలామందికి అనుమానం. దానిని ఏ పేరుతో పిలిచినా తప్పులేదు. ‘బౌద్ధం’ బౌద్ధంగానే ఉంటుంది కాని మారదు. పేరులోనేముంది? మనం ‘మల్లె’ అని పిలిచే పదాన్ని మరేపేరుతో పిలిచినా దాని సుగంధం ఒకటే. మధురంగా ఉంటుంది. రాజకుటుంబంలో జన్మించి, అతిలోక సౌందర్యవతి అయిన భార్యను, ముద్దులు మూటగట్టే కుమారుని పొందాడు గౌతముడు. సుఖభోగాలు పొందడం ఆయనకు అతి సులభమైన పని. అయితేనేం, సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దుఃఖ విముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసార సుఖాలను గడ్డిపోచతో సమానంగా త్యజించి ‘త్యాగం’ అంటే ఇలా ఉండాలి అని చూపిన ఆచరణశీలి. అంతులేని ధనరాశులతో పొందలేని ఆత్మజ్ఞానం అనంతమైన జ్ఞానసాగరంలోని కేవలం ఒక్క బిందువుతోనే అపారంగా పొందవచ్చని గ్రహించాడు.తానేది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే అక్షరాలా ఆచరించాడు. ఆయన బోధనలు మానవ ధర్మబద్ధమైన, హేతుబద్ధమైన, పవిత్రమైన జీవనానికి Ðð లుగు బాటలు పరిచాయి. శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించవచ్చునని, ప్రేమ వల్లనే ద్వేషం నశిస్తుందని ఆయన బోధించాడు. మతమంటే మరేదో కాదు, అన్ని ప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండడమేనని, అందరినీ ప్రేమించడమే మానవత్వమని నిరూపించాడు. అందువల్ల బౌద్ధమతం అనేకంటే, బౌద్ధం అనడమే సరైనది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top