నవ్వుల పౌరసత్వం

Mother and Daughter Happy After Release From Police Arrest in Varanasi - Sakshi

ఈ చిట్టి చిలకమ్మని చూడండి. అమ్మ కొట్టలేదు కానీ, రెండు వారాలుగా పాలే పట్టలేదు. ఆకలితో అలమటించి పోయింది. ఏడాది వయసు పాపాయి. తల్లిని, తండ్రిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళితే, ఈ పాపాయిని బంధువులు తీసుకెళ్లారు. అలా తల్లికి, బిడ్డకు ఎడబాటు కలిగింది. రెండువారాల తర్వాత నిన్ననే తల్లి జైలు నుంచి విడుదలైంది. ఆ వెంటనే వెళ్లి బిడ్డను ఎత్తుకుంది. గుండెకు హత్తుకుంది. బిడ్డ కోసం ఈ తల్లి కూడా అలమటించింది మరి. ఇప్పుడు చూడండి..

ఇద్దరూ ఎలా నవ్వులు చిందిస్తూ ఉన్నారో. పాలు పట్టిన తర్వాతి సీన్‌ కావచ్చు ఇది. మరి తండ్రి ఏమైనట్లు? ఆయన్ని ఏ జైలుకు తీసుకెళ్లారో తెలియదు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. అసలు జైలుకెళ్లేంత పెద్దతప్పును ఈ పాపాయి తల్లిదండ్రులు ఏం చేసినట్లో?! పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుపుతున్నవారితో కలిసి నినాదాలు ఇచ్చారు. ఆమె యాక్టివిస్టు కూడా. భార్యతో కలిసి భర్తా పిడికిలి బిగించాడు. పోలీసులు ఆ పిడికిళ్లకు సంకెళ్లు వేశారు. వీళ్లది వారణాసి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top