దీప కాంతి

Milk And Honey Serves As A Moisturizer For The Skin - Sakshi

బ్యూటిప్స్‌

వెలుగుతున్న ప్రమిదను చేత పట్టుకున్నప్పుడే కాదు, మిగతా సమయాల్లోనూ మోము అంతే కాంతిమంతంగా మెరవాలనుకుంటారు. అందుకు ఇంట్లోనే తయారుచేసుకొని వాడదగిన కొన్ని సహజ సౌందర్య చికిత్సలివి.

►ఓట్స్‌లో పాలు లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు రోజూ చేస్తూ ఉంటే మీ ముఖకాంతి పెరుగుతుంది.

►పొడిచర్మం గలవారు బాదం పొడిలో పాలు లేదా పెరుగు, తేనె, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. బాదం పొడి, తేనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్లుగా ఉపయోగపడతాయి.

►స్ట్రాబెర్రీ లేదా కమలాలు చర్మానికి రసాయనాలు లేని బ్లీచ్‌లా ఉపయోపడతాయి. వీటి రసాన్ని ముఖానికి రాసి, 5–10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మంపైన జిడ్డు తగ్గి పిగ్మెంటేషన్, మొటిమల వంటి సమస్యలను నివారిస్తాయి.

►గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, గొంతుకు రాయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖంపైన  అతి సన్నని వెంట్రుకలను కూడా నివారిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top