నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్‌ చేశాను. తను కూడా ఓకే చెప్పింది. ఆరేళ్లుగా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. తను నాతో ఎప్పుడూ ‘నువ్వు లేకుండా బతకలేను’ అని చెప్తుండేది. కానీ రెండేళ్ల కిందట వేరే అబ్బాయి తనకు ప్రపోజ్‌ చేశాడు. తను నో చెప్పింది. తర్వాత చాలామంది ‘వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు’ అని చెప్పారు. నేను చూడలేదు కాబట్టి అడగలేదు. రీసెంట్‌గా తను వాడితో మాట్లాడడం నేను చూశాను. తనను అడిగితే ‘అసలు వాడిని చూసి ఏడాది అయింది’ అని చెప్పింది. రోజూ ఆన్‌లైన్‌ ఉండి కూడా నాకు రిప్లై ఇవ్వడం లేదు. నన్ను అవాయిడ్‌ చేస్తోంది, తిడుతోంది. ఇంకా ఒకరోజు... గట్టిగా అడిగితే గుడ్‌బై చెప్పిందన్నా. నాకు చనిపోవాలనిపిస్తోందన్నా. ఖురాన్‌లో సూసైడ్‌ చేసుకుంటే నరకానికి వెళ్తారని ఉంది. అందుకని భయపడి ఏమీ చేసుకోలేక పోతున్నాను. ప్లీజ్‌ అన్నా! ఈ పెయిన్‌ నుంచి ఎలా బయటకు రావాలో చెప్పన్నా ప్లీజ్‌. రోజూ వాళ్లిద్దరూ కళ్లముందు కనిపిస్తుంటే పెయిన్‌ ఫ్రెష్‌ అవుతోంది. – ఖదీర్‌
ఏం అన్నయ్యా! వింటుంటేనే బాధగా ఉంది. చాలా బలమైన వాడివి నువ్వు. ఎంతో కరేజ్‌ ఉంది నీకు. ఇంకొకరయితే పూర్తిగా డౌన్‌ అయిపోయేవారు. నీ జీవితాన్ని ఎప్పుడూ ఇంకొకరి చేతుల్లో పెట్టద్దు. ఇంకొకరి ప్రవర్తన నీ జీవితాన్ని శాసించకూడదు. ఇంకొకరి ఇష్టాయిష్టాల మీద మన జీవితం నడవకూడదు. మన జీవితం నడిస్తే ఖుదా ప్రేమవల్లే నడవాలి. ఖుదా సేవలో నడవాలి. నీకు మంచి జీవితభాగస్వామిని కూడా సమయమే అందిస్తుంది. ‘అవును సార్‌. తప్పకుండా ఖదీర్‌కి మంచి రోజులు వస్తాయి’ ఇన్షా అల్లాహ్‌.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Back to Top