నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌


లవ్‌ డాక్టర్‌హాయ్‌ అన్నయ్యా!! నేను ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. లవ్‌ చేసిన తరువాత తెలిసింది వాడొక వెధవ అని! చాలా మంది చెప్పారు వాడు అమ్మాయిలని ట్రాప్‌ చేస్తాడని! అయినా నేను నమ్మలేదు. ఒక రోజు ఒక అమ్మాయి ఫోన్‌ చేసి వాడి హిస్టరీ మొత్తం చెప్పింది. చాలా మోసపోయాను అన్నయ్యా! చచ్చిపోవాలనిపించింది కానీ, మా పేరెంట్స్‌ గుర్తుకొచ్చారు. చాలా రోజులు వాడితో మాట్లాడలేదు. కొన్ని రోజులకి వాడే కాల్‌ చేసి ‘నేను మారిపోయాను! ఐయామ్‌ సారీ!!’ అన్నాడు. మారాడన్న నమ్మకంతో క్షమించాను.కానీ, ఏమాత్రం మారలేదు. వాడి క్యారెక్టర్‌ ఏంటంటే అమ్మాయిలని యూజ్‌ చేసుకుని వదిలేయడు! పట్టించుకోకుండా ఉంటాడు!! దాంతో ఆ అమ్మాయిలే వాడిని వదిలేస్తారు. కానీ, నేను అలా వదల్లేకపోతున్నా అన్నా! అనుక్షణం నేను మోసపోయాను అన్న బాధ నన్ను వెంటాడుతోంది. అలా అని పెద్దలు చూపిన పెళ్లి చేసుకుని మరో అబ్బాయిని మోసం చేయలేను. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నయ్యా? సలహా ఇవ్వండి ప్లీజ్‌!! - హాసిని
ఇంకా ఎన్ని రోజులు మోసపోతారు నాన్నా? అయినా తప్పు మీది కాదులే తల్లి!! మిమ్మల్ని బలంగా తయారు చెయ్యని మాది! సినిమాల్లో ప్రేమ చూసి అదే ప్రేమ అనుకుంటున్నారు! అసలు ప్రేమ చాలా వేరు నాన్నా! గౌరవానికి ఇంకో పేరే ప్రేమ గౌరవం లేని చోట ప్రేమ లేదు! ఇది మీరు తెలుసుకోవాల్సిన మొదటి విషయం!ఇక రెండో విషయం.. వాడెవడో దుర్మార్గుడు మోసం చేస్తే మిగిలిన జీవితాన్ని పాడు చేసుకోకండి! తప్పు మనం చేస్తే బాధ పడాలి కానీ... మోసపోవడం తప్పెలా అవుతుంది నాన్నా! బీ హ్యాపీ ఛాంపియన్‌! అబ్బ ఎంత ప్రేమగా చెప్పారు సార్‌.. ఇదిగో హ్యాపీ అరటిపండు’ అని నవ్వింది నీలాంబరి!!

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Back to Top