రారండోయ్‌

Literature Events Telugu States - Sakshi
  • సుంకోజి దేవేంద్రాచారి నవల ‘రెక్కాడినంత కాలం’ ఆవిష్కరణ ఆగస్టు 27న ఉదయం 10:30కు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఆవిష్కర్త: మధురాంతకం నరేంద్ర. నిర్వహణ: తిరుపతి ప్రెస్‌క్లబ్‌
  • ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య పరిచయం’గా మందలపర్తి కిశోర్‌ రాసిన ‘పెరటి చెట్టు’ ఆవిష్కరణ ఆగస్టు 30న సాయంత్రం 5:30కు విశాఖపట్నంలోని పబ్లిక్‌ లైబ్రరీలో జరగనుంది. ఆవిష్కర్త: డాక్టర్‌ దీర్ఘాశి విజయభాస్కర్‌.
  • వేమన వసంతలక్ష్మి ‘సండే కామెంట్స్‌’ పుస్తక పఠనం కార్యక్రమం సెప్టెంబర్‌ 2న సాయంత్రం 4 గంటలకు అస్మిత రిసౌర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్, హైదరాబాద్‌లో జరగనుంది. నిర్వహణ: అస్మిత కలెక్టివ్‌.
  • శేషభట్టర్‌ కవితాసంపుటి ‘మోహధూపం’ ఆవిష్కరణ సెప్టెంబర్‌ 1న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌.
  • ‘కామన్‌ డయాస్‌’ ఆధ్వర్యంలో నాళేశ్వరం శంకరం కవిత్వంపై సమాలోచన, రఘుశ్రీకి సత్కారం, కవి సమ్మేళనం, చర్చ కార్యక్రమాలు సెప్టెంబర్‌ 2న ఉదయం 10 గంటలకు బీసీ సాధికారత సంస్థ, హిమాయత్‌నగర్‌లో జరగనున్నాయి.
  • ఎన్‌.రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం–2018 కోసం 2016–18 మధ్య వెలువడిన తెలుగు విమర్శ గ్రంథాలను సెప్టెంబర్‌ 25లోగా ఆహ్వానిస్తున్నారు. పురస్కార నగదు పదివేలు. ప్రదానం నవంబర్‌ 12న. చిరునామా: డాక్టర్‌ ఎన్‌.రామచంద్ర, 26–905, నాగేంద్ర నగర్, ప్రొద్దుటూరు–516360. ఫోన్‌: 9293924501. నిర్వహణ: సాహితీ మిత్రమండలి.
  • అవనిగడ్డ, గాంధీక్షేత్రం వారు కోడీహళ్లి మురళీమోహన్, కస్తూరి మురళీకృష్ణ సంపాదకులుగా అక్టోబర్‌ 2 నాటికి మహాత్మాగాంధీ జీవితం, సిద్ధాంతాల ఆధారంగా తెలుగులో వచ్చిన కథలతో సంకలనం తేనున్నారు. ఇట్లాంటి కథల వివరాలు తెలిస్తే 9701371256కు తెలియజేయాలని కోరుతున్నారు.
     
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top