రారండోయ్‌

Literature Events In Telugu States - Sakshi
  • శాంతి నారాయణ కవితా సంపుటి ‘కొత్త అక్షరాలమై’, కథా సంపుటి ‘బతుకు బంతి’ ఆవిష్కరణ సభ ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్తలు: కె.శివారెడ్డి, ఎ.ఎన్‌.జగన్నాథ శర్మ. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌.
  •  గుల్జార్‌ ‘గ్రీన్‌ పొయెమ్స్‌’కు ఆనంద్‌ వారాల చేసిన తెలుగు అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’; ఆనంద్‌ వారాల ‘సిగ్నేచర్‌ ఆఫ్‌ లవ్‌’కు చంద్ర మనోహరన్‌ తమిళ అనువాదం ‘అనబిన్‌ కైచ్చాందు’; ఆనంద్‌పై కె.లక్ష్మి గౌతం తీసిన డాక్యుమెంటరీ ‘అక్షర తెర’ ఆవిష్కరణ సభ ఆగస్టు 20న కరీంనగర్‌ ఫిలిమ్‌ భవన్‌లో జరగనుంది. నిర్వహణ: కరీంనగర్‌ ఫిలిం సొసైటీ. 
  •   చలపాక ప్రకాష్‌ కవితా సంపుటి ‘మూడో కన్ను’ ఆవిష్కరణ ఆగస్టు 22న సాయంత్రం 6 గంటలకు విజయవాడ కల్చరల్‌ సెంటర్, మొగల్రాజపురం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్‌. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం.
  •   గూగీ వా థియాంగో నవల ‘వీప్‌ నాట్‌ చైల్డ్‌’కు ఎ.ఎం.అయోధ్యారెడ్డి చేసిన తెలుగు అనువాదం ‘ఏడవకు బిడ్డా...’ ఆవిష్కరణ ఆగస్టు 27న సాయంత్రం 5:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: అల్లం రాజయ్య. నిర్వహణ: మలుపు.
  •    నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో విజయవాడలో జరగనున్నాయి. ఇందులో ‘తెలుగు భాషాభివృద్ధిలో రచయితలు– కవులు’ అంశంపై 300 మంది కవులతో ‘300 కవితల పండుగ’ జరగనుంది. పాల్గొనదలచినవారు 9246415150లో సంప్రదించవచ్చు.
  •   రచయితల మొదటి నవలలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2014–17 మధ్య రాసి ఎక్కడా అచ్చుకాని నవలలకు రూ.10 వేలు, 5 వేల రెండు బహుమతులను అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు డిసెంబర్‌ 24న ప్రదానం చేయనుంది. రచయితలు మూడు ప్రతులను అక్టోబర్‌ 31లోగా ‘డి.స్వప్న, కార్యదర్శి, అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు, 2–7–71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ–506001’ చిరునామాకు పంపాలి. ఫోన్‌: 0870–2456458.
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top