రారండోయ్‌

Literature Events In Telangana And Andhra Pradesh - Sakshi
  • సాహిత్య అకాడెమి ‘దక్షిణ భారత కవిత్వ ఉత్సవం’ ఫిబ్రవరి 10న ఉదయం 11:30కు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. స్వాగతం: కె.శ్రీనివాసరావు. కీలకోపన్యాసం: కె.శివారెడ్డి.
  • చైతన్య ప్రకాశ్‌ సంస్మరణ సభ ఫిబ్రవరి 5న సా. 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. కాశీం, కె.పి.అశోక్‌ కుమార్, వి.శంకర్‌ వక్తలు. అధ్యక్షత: నాళేశ్వరం శంకరం. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం.
  • కవిసమ్రాట్‌ నోరి నరసింహ శాస్త్రి 120వ జయంతి ఉత్సవం ఫిబ్రవరి 6న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో జరగనుంది. నోరి పురస్కారాన్ని ఆచార్య కొల్లూరు అవతారశర్మకూ, నోరి యువరచయిత పురస్కారాన్ని రాంభట్ల వేంకటరాయశర్మకూ ప్రదానం చేస్తారు. ముఖ్య అతిథి: జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు.
  • కొండపల్లి నీహారిణి రెండు పుస్తకాలు ‘సృజన రంజని’, ‘రాచిప్ప’ల ఆవిష్కరణ ఫిబ్రవరి 7న ఉదయం 10:30కు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్తలు: నందిని సిధారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళం పరంపరలో భాగంగా ఫిబ్రవరి 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో కాళోజీ నారాయణరావు ‘నా గొడవ’ పై డాక్టర్‌ తూర్పు మల్లారెడ్డి ప్రసంగిస్తారు.
  • ఎన్‌.శైలజ చేసిన ఖలీల్‌ జిబ్రాన్‌ అనువాద కవిత్వం ఆవిష్కరణ ఫిబ్రవరి 8న సాయంత్రం 6 గంటలకు కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడలో జరగనుంది.
  • జి.ఎన్‌.సాయిబాబా అండాసెల్‌ కవిత్వం ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ ఆవిష్కరణ ఫిబ్రవరి 9, 10ల్లో నల్గొండలో జరగనున్న విరసం సాహిత్య పాఠశాలలో జరగనుంది. ప్రచురణ: విరసం.
  • అరుణ్‌ సాగర్‌ సంస్మరణ సభ (3వ వర్ధంతి) ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడలో జరగనుంది. అధ్యక్షుడు: ఖాదర్‌ మొహియుద్దీన్‌. వక్తలు: చినుకు రాజగోపాల్, కోయి కోటేశ్వరరావు. అరుణ్‌ సాగర్‌ జీవన సాఫల్య సాహిత్య పురస్కారాన్ని జి.లక్ష్మీనరసయ్యకు ప్రదానం చేస్తారు. నిర్వహణ: సాగర్‌ మిత్రులు, సాహితీ మిత్రులు.
  • మెట్టా నాగేశ్వరరావు తొలి కవితా సంపుటి ‘మనిషొక పద్యం’ ఆవిష్కరణ ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బయ్యనగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనుంది. అతిథి: కొప్పర్తి.  ‘ఊరూరా కవిసంగమం–9’లో భాగంగా జి.లక్ష్మీనరసయ్య ప్రసంగిస్తారు.  
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top