రారండోయ్

- సి.వి. కృష్ణారావు (1926–2019) ‘స్మృతి మననం’ కార్యక్రమం సెప్టెంబర్ 11న సా. 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: ‘తెలంగాణ చైతన్య సాహితి’, ‘నెలనెలా వెన్నెల సాహితీ మిత్రులు’, ‘తెలంగాణ రచయితల సంఘం’.
- తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా సెప్టెంబర్ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో కవిరాజమూర్తి నవల ‘మై గరీబ్ హూ’పై తాటికొండాల నరసింహారావు ప్రసంగిస్తారు.
- అన్నపరెడ్డి బుద్ధఘోషుడు రచించిన ‘ఓ అనాత్మవాది ఆత్మకథ’ పుస్తక విమోచన సభ సెప్టెంబర్ 15న సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో జరగనుంది. ఆవిష్కర్త: కె.కె.రాజా. అనంతరం అన్నపరెడ్డికి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం జరగనుంది.
- ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా అందిస్తున్న సçహృదయ సాహిత్య పురస్కారానికి 2018కిగానూ మందరపు హైమవతి ‘నీలిగోరింట’ ఎంపికైందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎన్. చారి తెలియజేస్తున్నారు. సెప్టెంబరు 15న రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం, హనుమకొండలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
- ఈ యేడు ప్రారంభిస్తున్న ఉదారి వాణిదాసు స్మారక పురస్కారాన్ని కవి అన్నవరం దేవేందర్‌కు సెప్టెంబర్ 15న ఆదిలాబాద్‌లో ప్రదానం చేస్తున్నట్టు ఉదారి నారాయణ తెలియజేస్తున్నారు.
- డాక్టర్ సి.భవానీదేవి ‘స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ’, చారిత్రక నవల ‘బంగారు కల’ ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 15న ఉదయం 10:30కు గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో జరగనుంది. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం.
- డాక్టర్ శాంతి నారాయణ రచనలు– ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు’ 2వ భాగం ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు అనంతపురం, రుద్రంపేటలోని వాల్మీకి భవనంలో జరగనుంది. నిర్వహణ: విమలాశాంతి సేవాసమితి.
- సి.సి. నెమరు పుస్తకావిష్కరణ సెప్టెంబర్ 15న ఉ.11 గంటలకు వనపర్తి జిల్లా అచ్యుతాపురంలో జరుగుతుంది. సభాధ్యక్షత: సి.రాంమోహన్: నిర్వహణ: సిఎన్‌ఆర్ మెమోరియల్ ట్రస్ట్.
- 2019 రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కోసం 2017, 18, 19 సంవత్సరాల్లో ప్రచురించబడిన తెలుగు కవితా సంపుటాల 5 ప్రతులను అక్టోబర్ 21లోగా పంపాలని కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ కోరుతున్నారు. విజేతకు 15 వేల నగదు పురస్కారం ఉంటుంది. చిరునామా: అధ్యక్షులు, రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505301.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి