అవునా కంగనా?!

అవునా కంగనా?!


విశాల్‌ భరద్వాజ్‌ సినిమా ‘రంగూన్‌’ ఈ నెల 24న విడుదల అవుతోంది. అందులో కంగనా రనౌత్‌.. సైఫ్‌ అలీఖాన్‌ని, షాహిద్‌ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఎలా సాధ్యం ఏకకాలంలో ఇద్దర్ని ప్రేమించడం? ఎవరో ఒకరి మీదే కదా ప్రేమ ఉంటుంది. ఇద్దరి మీదో, ముగ్గురి మీదో ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది? మనకైతే.. ఇన్ని డౌట్స్‌ వస్తున్నాయి కానీ, కంగనాకు మాత్రం క్లారిటీ ఉంది. సినిమాలో.. సైఫ్‌కి కంగనా కావాలి. కంగనాకి సైఫ్‌ కావాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేరింగ్‌తో ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అతడిని ఆమె, అమెను అతడు కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు బాధ కలిగితే అతడు హర్ట్‌ అవుతాడు. అతడు బాధపడితే ఆమె హర్ట్‌ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంటుంది. లిప్‌ కిస్‌లు కూడా ఇచ్చుకుంటారు.‘అయితే ఇదంతా లవ్‌ కాదు, బంధం మాత్రమే’ అంటుంది కంగనా.మరి, షాహిద్‌ కపూర్‌తో కంగనాకు ఉన్నదేమిటి? అదేనట ఒరిజినల్‌గా ప్రేమంటే!‘ప్రేమ తనకదే ఏ కారణం లేకుండానే పుడుతుంది. సహాయాల వల్లనో, కేరింగ్‌ కారణంగానో ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టినా అది ప్రేమ కాదు. ప్రేమంటే.. మనల్ని మనకు కొత్తగా చూపించేది’ అంటోంది కంగనా! సో.. ప్రేమలో బంధం, బంధనం ఉండవని అనుకోవాలి.బంధం, బంధనం లేనివే ప్రేమ అనుకోవాలి... అవునా కంగనా?

Back to Top