అజీర్ణం...కడుపు ఉబ్బరం...నయమవుతాయా?

Homeo Counseling on Infertility - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 52 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?– ఆర్‌. యాదగిరిరెడ్డి, నల్లగొండ

జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

కారణాలు
– 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్‌ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.

లక్షణాలు
 కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం  ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ కోసంపాటించాల్సిన జాగ్రత్తలు
సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి  తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.

చికిత్స
 హోమియో వైద్యవిధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,హైదరాబాద్‌

ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి?చికిత్స ఉందా?
మా బాబు వయసు ఆరున్నరేళ్లు. ఎప్పుడూ ఉన్న చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్‌ నుంచి ఎవరో ఒక టీచర్‌ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్‌ చేస్తుంటారు. డాక్టర్‌కు చూపిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా?– ఆర్‌. సుందరయ్య, తాడేపల్లిగూడెం 

ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు.సమస్యకు కారణాలు∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు.లక్షణాలు మతిమరపు, తలనొప్పి  ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు మానసిక స్థితి చక్కగా లేకపోవడంఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం.ఇతరులను ఇబ్బంది పెట్టడం.

నిర్ధారణ రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారైచికిత్స
 హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి?
నా వయసు 34 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా?– ఒక సోదరి,మంచిర్యాల 

ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్‌ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు      ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్‌ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం.
పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: హార్మోన్‌ సంబంధిత సమస్యలు థైరాయిడ్‌  పొగతాగడం శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం
సంతానలేమిలో రకాలు : ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్‌ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ రావడం వల్ల సంభవిస్తుంది.

గుర్తించడం ఎలా: తగిన వైద్యపరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్‌ హోమియోపతి,హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top