హిల్లరీ లాంటి అత్తగారు కావాలి!

హిల్లరీ లాంటి అత్తగారు కావాలి! - Sakshi


కాబోయే భర్త విషయంలోనే కాక తను అడుగుపెట్టబోయే కుటుంబంలోని వ్యక్తుల మనస్తత్వం విషయంలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకోవడం సహజమే. ప్రత్యేకించి మెట్టినింటిలో ఉన్నప్పుడు అత్తతో ఉండే అనుబంధం మీ జీవితాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి అత్తగారు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు.  మరి మంచి అత్తగారు ఎలా ఉంటారు? అని అమెరికన్ ఆడవాళ్ల వద్ద ప్రస్తావిస్తే అచ్చం హిల్లరీ క్లింటన్‌లా అని అంటున్నారు.


తాజాగా ఒక అధ్యయనంలో కోడలి కోణం నుంచి ఒక మంచి అత్తగారికి ఎలాంటి సుగుణాలు ఉండాలో అవన్నీ మిసెస్ క్లింటన్‌లో ఉన్నాయని తేలింది. మొన్నటి వరకూ అమెరికా విదేశాంగమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌లో వ్యవహారాలను చక్కబెట్టే నేర్పు, పక్కవాళ్లతో అనుంబంధాలను కొనసాగించడంలో చొరవకు మంచి మార్కులు వేయవచ్చని అమెరికన్ యువతులు అంటున్నారు. ఈ జాబితాలో అమెరికాకే చెందిన పలువురు మహిళా వ్యాపారవేత్తలను, సీనియర్ సెలబ్రిటీలను పెట్టినా ఎక్కువ మంది హిల్లరీకే ఓటేశారు. తమకు అలాంటి అత్తగారు దొరికితే  చాలని అంటున్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top