సమ్మర్‌ క్రేజ్‌


టౌన్‌లో దీన్ని గౌన్‌ అంటారు. సిటీకి వచ్చి ఇది ఫ్రాక్‌ అయ్యింది. చిన్నవాళ్లు వేసుకుంటే గౌన్‌ అనేవారు. పెద్దవాళ్లు వేసుకుంటే ఫ్రాక్‌ అంటున్నారు. గౌనైనా... ఫ్రాకైనా... చిన్నయినా... పెద్దయినా... ఇప్పుడిదే సమ్మర్‌ క్రేజ్‌!!!



నిలువు... అడ్డ చారలు

మరీ పొడవుగా ఉన్నవారు కాస్త ఎత్తు తక్కువ కనిపించాలంటే అడ్డచారలు, పొట్టిగా ఉన్నవారు పొడువుగా కనిపించాలంటే నిలువు చారల డిజైన్స్‌ సరైన ఎంపిక.



స్కర్ట్‌ మోడల్‌

పూర్తి ఒకే రంగుతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఫ్రాక్‌ స్కర్ట్, టాప్‌ రెండింటి కాంబినేషన్‌తో రూపుదిద్దుకుంది. వదులుగా ఉండే లాంగ్‌ స్లీవ్స్‌ ప్రత్యేక ఆకర్షణ. సాయంకాలం వెస్ట్రన్‌ టైప్‌ పార్టీలకు స్పెషల్‌ అట్రాక్షన్‌.





లేయర్డ్‌ స్టైల్‌

తెలుపు, పసుపు కాంబినేషన్‌ మాదిరిగానే ఇతర రంగులతోనూ ఈ తరహా స్టైల్‌ను సృష్టించవచ్చు. రెండు పూర్తి కాంట్రాస్ట్‌ ఫ్రాక్స్‌ ధరిస్తే ఓ కొత్త స్టైల్‌తో ఆకట్టుకోవచ్చు.





ఓవర్‌కోట్‌ స్టైల్‌

నలుపు–తెలుపు కాంబినేషన్‌లో ఫ్రాక్‌ ధరిస్తే ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. స్లీవ్‌లెస్‌ వైట్‌ ఫ్రాక్, పైన ఓవర్‌కోట్‌లా ఉండే లాంగ్‌స్లీవ్స్‌ బ్లాక్‌ టీ షర్ట్‌ మరింత అందాన్నిస్తుంది.





షోల్డర్‌లెస్‌

ఈవెనింగ్‌ పార్టీలకు టీనేజ్‌ గర్ల్స్‌ మెచ్చే ఫ్రాక్స్‌ జాబితాలో షోల్డర్‌లెస్‌ ఫ్రాక్‌ ఒకటి. రంగు రంగు ప్రింట్లతో ఉన్న కాటన్‌ మెటీరియల్‌ను ఈ ఫ్రాక్స్‌ డిజైన్‌కి ఉపయోగిస్తే వేసవి కూల్‌ కూల్‌గా గడిచిపోతుంది.



షర్ట్‌ స్టైల్‌

పురుషుల ఖాతాలో ఉండే షర్ట్‌ స్టైల్‌ ఫ్రాక్‌... అమ్మాయి మేనిపై అందంగా అమిరితే ఇలా ముచ్చటగా కనిపిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top