చిన్నారి స్టోరీకి విశేష స్పందన

చిన్నారి స్టోరీకి విశేష స్పందన


ఈ అమ్మాయి పేరు దుర్గ. దుర్భర పరిస్థితులతో దుర్గలా పోరాడుతోంది.సరస్వతిలా చదువులో ఎదగాలని తపిస్తోంది. పిల్లలతో కలసి ఉదయం స్కూలుకు వెళుతుంది. పెద్దవాళ్లతో కలిసి సాయంత్రం పనికీ పోతుంది! కానీ పాపం... దుర్గకు ఇప్పుడు పని ఒక్కటే మిగిలింది. చదువు... ‘కాలి, బూడిదైపోయింది’. అయితే... చదువుకోవాలన్న తపన మాత్రం రగులుతూనే ఉంది. దుర్గది హైదరాబాద్. ఈ చిన్నారి స్టోరీని సాక్షి ‘ఫ్యామిలీ’ డిసెంబర్ 18 సంచిలో ప్రచురించింది. నాటి నుంచి నేటి వరకు...

 ఎందరో పాఠకులు దుర్గకు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు.

 వారి కోసం దుర్గ అకౌంట్ నెంబరును ఇక్కడ ఇస్తున్నాం. పేరు : ఆమంచి దుర్గాభవాని

 బ్యాంకు : ఆంధ్రాబ్యాంక్, రామ్ నగర్ బ్రాంచ్, హైదరాబాద్

 ఖాతా నెం: 13310100087103

 IFS CODE ;ANDB0001339


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top