గాయాలు త్వరగా మాన్పే ఉలవలు
ఉలవల్లో ప్రోటీన్లు, పిండిపదార్థాలు, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఎక్కువ. ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో కొన్ని...
♦ ఉలవల్లో పీచు చాలా ఎక్కువ. ఫలితంగా అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని, ఇతర జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.
♦ ఉలవల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. అందుకే గాయాలు త్వరగా మానాలని భావించే వారు ఉలవలతో చేసిన పదార్థాలు తినడం ఎంతో మంచిది.
♦ ఒబెసిటీని నివారించడానికి ఉలవలు మంచి ఆహారం.
♦ ఇందులో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వాటిని దృఢంగా ఉంచుతాయి.
♦ ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇవి రక్తహీనతను అరికడటాయి.
మరిన్ని వార్తలు