ఈవిడెవరో చెప్పుకో?

guess who is she? - Sakshi

ఎం.ఇ.డబ్ల్యూ. అన్న రిసెర్చ్‌ సంస్థకు పనిలేక పిల్లి తల గొరిగింది. ఎం.ఇ.డబ్ల్యూ.ని ఇంగ్లిష్‌లో కలిపి చదివితే .. మ్యావ్‌. అంటే పిల్లి కూత. అందుకేనేమో ఒక పనికిరాని పని పెట్టుకుంది. పెళ్లిళ్లలో ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏదీ అన్న టాపిక్‌పై రిసెర్చ్‌ కండక్ట్‌ చేసింది. పిల్లి తల గొరిగే రిసెర్చ్‌లాగే ఉంది కదా. మరదే. కానీ ఈ రిసెర్చ్‌ ఫైండింగ్స్‌ మాత్రం మ్యావ్‌ మ్యావ్‌ మ్యావ్‌లే. సర్వేలో కోడళ్ల గురించి కంప్లైంట్‌లే నంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంటాయని అందరూ అనుకున్నారట.

అబ్బాయి కోసం అమ్మాయిని వెతకడం, అమ్మాయి కోసం అబ్బాయిని వెతకడమే మేజర్‌ ప్రాబ్లమ్‌గా ఉంటుంది పెళ్లిళ్లలో అనుకున్నారట. అనుకోడానికి ఏముంది? ఏమైనా అనుకుంటాం. కానీ, రిసెర్చ్‌ ఫైండింగ్స్‌ మ్యావ్‌ మ్యావ్‌ అని ఈ రెండింటినీ మింగేసి, కొత్త మ్యావ్‌ని ప్రవేశపెట్టాయి. ఢిల్లీ ఫార్మ్‌ హౌస్‌లలో జరుగుతున్న పెళ్లిళ్లలో ఎక్కువగా అడిగిన ప్రశ్న.. ‘ఈవిడ ఎవరో చెప్పుకో చూద్దాం’ అని. పెళ్లికి వచ్చిన బంధువులలో ఒకరిని చూపించి ఈ ప్రశ్నను పిల్లల్ని అడిగితే ఎవరూ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఒక పాపకు ఒక ఆయన్ని చూపించి ‘ఈయన ఎవరో చెప్పుకో చూద్దాం?’ అని అడిగితే ఆ పాప  ‘పాపా’ అందట! అంటే డాడీ అని. ఇవండీ.. మన బంధు సంబంధాలు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top