అలెగ్జాండర్‌ డ్యూమా

 Great writer Alexandre Dumas - Sakshi

♦ గ్రేట్‌ రైటర్‌
అత్యంత సాహసాలతో కూడిన రచనలకు పేరెన్నికగన్న అలెగ్జాండర్‌ డ్యూమా(1802–1870) తన జీవితకాలంలో సుమారు లక్ష పేజీల సాహిత్యాన్ని సృష్టించాడు. హైతీ మూలాలున్న ఈ ఫ్రెంచ్‌ రచయిత ఫ్రాన్స్‌లో అత్యధికంగా చదవబడే రచయితల్లో ఒకడిగా నిలిచాడు. ద త్రీ మస్కెటీర్స్, ద కౌంట్‌ ఆఫ్‌ మాంటె క్రిస్టో, ట్వెంటీ ఇయర్స్‌ ఆఫ్టర్‌ లాంటి రచనలు ఆయనకు ప్రపంచవ్యాప్త కీర్తిని తెచ్చి పెట్టాయి.

నవలలు, నాటకాలు, యాత్రా కథనాలు, వ్యాసాలు సహా విస్తృతంగా రాసిన డ్యూమా రచనల ఆధారంగా సుమారు 200 సినిమాలు వచ్చాయి. డ్యూమాకో చిత్రమైన అలవాటు ఉండేది. తన రచనల వర్గానికి అనుగుణంగా, వాటిని రాయడానికి భిన్నమైన రంగులు వాడేవాడు. ఫిక్షన్‌ కోసం నీలం రంగు ఉపయోగించేవాడు. కవిత్వం కోసం పసుపు రంగునూ, నాన్‌ ఫిక్షన్‌ రచనల కోసం గులాబీ రంగునూ వాడేవాడు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top