హైదరాబాద్‌ ఈవెంట్స్‌

Events in Hyderabad - Sakshi

గడియారం పురస్కార ప్రదానం
మాల్యశ్రీ(చింతూరి మల్లయ్య)కి గడియారం వేంకట శేషశాస్త్రి 36వ పురస్కార ప్రదానం అక్టోబర్‌ 2న ఉ.10 గంటలకు ప్రొద్దుటూరు తాలూకా కార్యాలయ ప్రాంగణంలో జరగనుంది. గడియారం వేంకట శేషశర్మ, ఎన్‌.సి.రామసుబ్బారెడ్డి, పాళెం వేణుగోపాల్, ఎం.జానకిరాం, విహారి, మూలె రామమునిరెడ్డి పాల్గొంటారు.

రొట్టమాకురేవు అవార్డులు
శిలాలోలిత, యాకూబ్‌ ఇస్తున్న రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల్ని ఈ యేడు సిద్ధార్థ (బొమ్మలబాయి), వాహెద్‌ (ధూళిచెట్టు), అనిశెట్టి రజిత (నిర్భయాకాశం కింద)కు ప్రకటించారు. అక్టోబర్‌ 8న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రదానం జరగనుంది. కాళోజీ పురస్కార గ్రహీత సీతారాంకు సత్కారం ఉంటుంది. కె.శివారెడ్డి, ప్రసేన్, జి.లక్ష్మీనరసయ్య, జూలూరి గౌరీశంకర్, అజీజుల్‌ హక్, రాజారాం తూముచర్ల, జి.సత్యశ్రీనివాస్‌ పాల్గొంటారు.

వరలక్ష్మమ్మ జయంతి సభ
కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతి సభ అక్టోబర్‌ 6న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. అయాచితం శ్రీధర్, ద్వానా శాస్త్రి, కళా జనార్దనమూర్తి, సి.భవానీదేవి పాల్గొంటారు.

షాయరె తెలంగాణ ఆవిష్కరణ
‘షాయరె తెలంగాణ: మఖ్దూం మొహియుద్దీన్‌ జీవితం– కవిత్వం’ ఆవిష్కరణ అక్టోబర్‌ 7న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. తమ్మినేని వీరభద్రం, మల్లు స్వరాజ్యం, పాశం యాదగిరి, చుక్కా రామయ్య, వరవరరావు, పల్లా వెంకటరెడ్డి, ఎం.ఎ.సికిందర్, జహీరుద్దీన్‌ అలీఖాన్, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, ఎస్‌.వీరయ్య, జఫర్‌ మొహియుద్దీన్, అబ్బాస్, కె.ఆనందాచారి పాల్గొంటారు.

మాగిపొద్దు ఆవిష్కరణ
ఉదారి నారాయణ కవితా సంపుటి మాగిపొద్దు ఆవిష్కరణ అక్టోబర్‌ 7న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్‌.గోపి. అమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, థింసా, ఎ.పరమాత్మ పాల్గొంటారు.

రామచరిత మానస్‌పై సమ్మేళనం
యూజీసీ, అయోధ్య రీసెర్చ్‌ సెంటర్‌ వారి ఆధ్వర్యంలో ‘సైంటిఫిక్‌ ఎప్రోచెస్‌ ఇన్‌ రామచరితమానస్‌’ అంశంపై అంతర్జాతీయ సమ్మేళనం అక్టోబర్‌ 13, 14 తేదీల్లో కాకినాడ పి.ఆర్‌.(పిఠాపూర్‌ రాజా) కళాశాలలో జరగనుంది. అభ్యర్థులు తమ పరిశోధనా పత్రాలను తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు పి.హరిరామ ప్రసాద్‌ ఫోన్‌: 9440340057

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top