రారండోయ్‌

Events of Up Coming Week in Hyderabad - Sakshi
  • నిఖిలేశ్వర్‌ కవితా సంపుటాలు ‘ఐదు దశాబ్దాల నిఖిలేశ్వర్‌ కవిత్వం’(1965–2015), ‘అగ్నిశ్వాస’(2015–17), ‘అనుసృజన’ల ఆవిష్కరణ మార్చి 3న సా. 5:30కు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో జరగనుంది. నిర్వహణ: నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ.
  • ‘తెలుగు లోగిలి’ ఆధ్వర్యంలో– జాతీయ సహస్ర కవిసమ్మేళనం ఫిబ్రవరి 25– 27 వరకు బాలికోన్నత పాఠశాల, అవనిగడ్డ, కృష్ణాజిల్లాలో జరగనుంది.
  • కొలకలూరి సాహితీ పురస్కార ప్రదాన సభ ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది.
  • తెలంగాణ సాహిత్య అకాడమి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన 13 పుస్తకాల పరిచయ సభ ఫిబ్రవరి 28న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లుగా రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది.
  • ‘అమ్మ–నాన్న–నేను’ కవితా సంకలనం (సంపాదకుడు: గుదిబండి వెంకటరెడ్డి) ఫిబ్రవరి 28న త్యాగరాయ గానసభలో ఆవిష్కరణ కానుంది.
  • రవూఫ్‌ ‘నది కాలం అతడు’ ఇస్మాయిల్‌ ఇతివృత్త కవితా సంపుటి ఆవిష్కరణ మార్చి 4న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది.
  • బీసీ చింతనతో వెలువరించనున్న సంకలనానికి మార్చి 25లోగా బీసీ కవులు తమ కవితలు పంపమని జూలూరు గౌరీశంకర్‌(ఎం.ఎస్‌.కె. టవర్స్, ఫ్లాట్‌–410, స్ట్రీట్‌–11, హిమాయత్‌ నగర్, హైద్రాబాద్‌–26) కోరుతున్నారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top