వంటింట్లో వంకాయ ఒంట్లో ఆరోగ్యం!

 eggplant is good for health

గుడ్‌ ఫుడ్‌

‘వంకాయ వంటి కూర’ వేరే ఏదీ లేదంటూ తెలుగులో సామెతలూ, పద్యసాహిత్యం ఉన్నాయి. వాస్తవంగా కూడా వంకాయలో ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి. వంకాయలో అనేక పోషకాలు, విటమిన్లు, ఫాస్ఫరస్, కాపర్, డయటరీ ఫైబర్, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియమ్, మ్యాంగనీస్‌ పుష్కలంగా ఉన్నాయి.  

►ఫోలిక్‌ యాసిడ్‌ గర్భస్థపిండంలో న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ను నివారిస్తుంది.  
►డయటరీ ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫైబర్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రక్తనాళాలకు వచ్చే అథెరోస్క్లిరోసిస్‌ కండిషన్‌ను నివారించడం ద్వారా గుండెపోటు, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది.
►వంకాయలో కొలెస్ట్రాల్‌ పాళ్లు దాదాపుగా లేవనే చెప్పుకోవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకున్నవారు వంకాయ కూర తినడం మంచిది.
►వంకాయలో విటమిన్‌ సి పాళ్లు కూడా ఎక్కువే. విటమిన్‌–సి ఒక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌. చాలారకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
►వంకాయలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ, వాటిని పటిష్టం చేస్తాయి. ఆ రకంగా వంకాయ ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి దోహదపడుతుంది.
►వంకాయలో ఐరన్‌కు తగినట్లు కాపర్‌ ఉంటుంది. ఎర్ర రక్తకణాలు తగిన సంఖ్యలో ఉండాలంటే ఐరన్, కాపర్‌ అవసరం.
►వంకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని మెదడుకు అందిస్తాయి.
►వంకాయలో సొల్యుబుల్‌ ఫైబర్‌... రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులకు కూడా మంచిది

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top