గుడ్డు – బెటర్‌ బెస్ట్‌!

గుడ్డు – బెటర్‌ బెస్ట్‌!


గుడ్‌ఫుడ్‌


గుడ్డు... ‘ఎగ్‌’సలెంట్‌ ఫుడు’ అని నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు. అందుకు అనువైన పోషకాలన్నీ అందులో ఉన్నాయి. గుడ్డుతో ఆరోగ్యానికి ఒనగూరే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అందులో కొన్ని...గుడ్డులోని విటమిన్‌–ఏ అంధత్వాన్ని నిరోధిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఎముకలు కాస్త కాస్త బోన్‌డెన్సిటీని కోల్పోతుంటాయి. గుడ్డు దీన్ని నివారిస్తుంది. కండరాలను బలపరుస్తుంది. వ్యాయామం చేసేవాళ్లు గుడ్డును తమ రోజువారీ మెన్యూలో తప్పక ఉండేలా చూసుకుంటారు.గుడ్డులోని తెల్లసొనలో మంచి కొలెస్ట్రాల్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెజబ్బులను నివారిస్తుంది. గతంలో కోడిగుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి అంత మంచిది కాదనీ, అది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని అపోహ ఉండేది. కానీ దాన్ని తినకపోవడం వల్ల వచ్చే ఆరోగ్యపరమైన అనర్థాలు చాలా ఉన్నాయని ఇటీవలని అధ్యయనల్లో తేలింది. దాంతో ఆ ఆధునిక పరిశోధనల ఆధారంగా, ఇప్పుడు పచ్చసొనను కూడా నిరభ్యంతరంగా తినమని ఆహార నిపుణులు, డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే డీజనరేటివ్‌ సమస్యలను గుడ్డు సమర్థంగా అడ్డుకుంటుంది. దీనిని నిర్ధారించే పరిశోధన పత్రాలను ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫుడ్‌ సైన్స్‌’లో ఇటీవలే ప్రచురించారు.

Back to Top