హ్యాపీ బర్త్‌డే స్కై

deepika Padmavathi controversy - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌లు ఇంటి బయటికి వచ్చేటప్పుడు దుస్తులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని ధరిస్తారు. అలాగే వాళ్ల ఫీలింగ్స్‌ని బయటికి కనిపించకుండా కేర్‌ఫుల్‌గా మేనేజ్‌ చేస్తుంటారు. ఏమో! ఏ కెమెరా ఏ యాంగిల్‌ నుంచి వాళ్లను షూట్‌ చేస్తుందో చెప్పలేం కదా. స్మార్ట్‌ఫోన్స్‌ వచ్చాకైతే ప్రతి ఒక్కరూ ఒక ఫొటోగ్రాఫరే.! అందుకే హీరోయిన్స్‌ భద్రంగా ఉంటారు. అయినప్పటికీ ఏదో ఒక ‘ఏమరుపాటు’ వారిని బయట పెడుతూనే ఉంటుంది. అయితే దీపికా పదుకోన్‌ మాత్రం ఇలాంటివేం పట్టించుకోరు. ముఖం మీద నవ్వు మాత్రం చెరగకుండా చూసుకుంటారు. అదొక్కటే ఆమె ప్రయారిటీ. అదైనా ఎందుకంటే.. ఆమెను విసిగించేవాళ్లు ఎక్కువ! ఫ్యాన్స్‌లోనే కాదు, మీడియాలోనూ ఒక్క క్లిక్‌ దొరికినా చాలని దీపిక కోసం నక్కి ఉంటారు.

ఇక ఇప్పుడైతే.. పద్మావతి కాంట్రవర్సీ మొదలయ్యాక, ఆమె కోసం కత్తులు, కటార్లు పట్టుకుని తిరిగేవారు కూడా తోడయ్యారు. అందరూ కలిసి ఆమె ప్రాణాలు తోడేస్తున్నారు. అంత ఒత్తిడి ఉంది కనుకనే.. ముఖం మీద చిరునవ్వును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దీపిక. అసలు అందుకే ఏదైనా అవార్డు ఇవ్వాలి దీపికకు... ‘మిస్‌ సహనం’ అని! పెద్దగా అరిచేస్తే, కోపంగా మాట్లాడితే.. దీపిక డిఫెన్స్‌లో పడిపోయిందనీ, పద్మావతి వివాదంలో ఆమె కాన్ఫిడెన్స్‌ దెబ్బతిందని సోషల్‌ మీడియాలో వచ్చేస్తుంది. అదొక భయం ఎలాగూ ఉంటుంది. విషయం ఏంటంటే.. నిన్న దీపిక బర్త్‌డే. బయటికి రాలేదు. ఆమె పోస్ట్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో మాత్రమే బయటికి వచ్చింది. తెల్లటి మేఘాలు ఉన్న నీలి ఆకాశం ఫొటో అది. దాన్ని పోస్ట్‌ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే స్కై’ అని విషెస్‌ చెప్పారు. తనకు తను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారా? కావచ్చు. ఆకాశంలో సగం కదా స్త్రీలు. తను తను ఆకాశంతో పోల్చుకుని ఉండొచ్చు దీపిక. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top