వావ్‌.. మాల్దీవ్స్‌

Celebrities in Social Media About Maldives - Sakshi

సిటీజనుల బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌గా గుర్తింపు

సెలబ్రిటీల పోస్టులకు నెటిజన్లు ఫిదా

తక్కువ ఖర్చుతో చుట్టేసే అవకాశం

నగరం నుంచి నెలలో పదివేలకు పైగా టూరిస్టుల పయనం

ఫ్రెండ్స్‌తో కలసి వెకేషన్‌కి అయినా..భార్యా భర్తల హనీమూన్‌కైనా, ఫ్యామిలీ వెకేషన్‌ అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా మాల్దీవ్స్‌ పేరే వినిపిస్తుంది. వెయ్యి పడకల ద్వీపాలతో రూపొందించిన మాల్దీవులలో బీచ్‌లు, నీలి మడుగులు, దిబ్బలు ఉంటాయి. బీచ్‌లోనే ఇల్లు,రెస్టారెంట్‌లు ఉంటాయి. హోటల్‌ రూమ్‌లో నిద్రిస్తుంటే నీళ్లు మనపై వెళ్తాయి. చేపలు మనల్ని ముద్దాడతాయి. వింతలు..విశేషాలు..ప్రకృతి సౌందర్యం వెల్లివిరుస్తుండడంతో అందరూ మాల్దీవుల టూర్‌ను ఇష్టపడుతున్నారు.

సోషల్‌ మీడియాలో క్రేజ్‌
సెలబ్రిటీలు తమకు నచ్చిన స్పాట్‌కి వెళ్లి సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌ కోసం ఓ పోస్ట్‌ని పెడుతున్నారు. దీనికి ఫిదా అయిన నెటిజన్లు  మనం కూడా ఆ స్పాట్‌కి వెళ్తే ఎంతబాగుంటుందంటూ సిద్ధమవుతున్నారు. క్షణాల్లో గూగూల్‌ సెర్చ్‌ చేసేస్తున్నారు.  దీంతో సోషల్‌ మీడియాలో ఇప్పుడు మాల్దీవులు క్రేజ్‌గా మారాయని చెప్పొచ్చు.

అతి తక్కువ ఖర్చుతో..
సిటీ నుంచి ప్రతి నెలా మాల్దీవులకు వెళుతున్న వారి సంఖ్య పదివేలకు పైగా ఉన్నట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. టూరిస్ట్‌ల కోసం అనేక ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇటీవల దసరా సందర్భంగా రెండు, మూడు ట్రావెల్‌ ఏజెన్సీలు ఫ్లైట్‌ అప్‌ అండ్‌ డౌన్, వసతి కలిపి రూ.32 వేలకు ఆఫర్‌ చేయడం గమనార్హం.

అద్భుతమైన బీచ్‌లు

మాల్దీవుల్లో ఉండే బీచ్‌లు సూపర్‌గా ఉంటాయి. మా హనీమూన్‌ మేం అక్కడే ఎంజాయ్‌ చేశాం. ఎన్నిరోజులైనా ఉండాలనిపించే ప్రదేశం అది. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ దొరుకుతుంది. అక్కడున్న వందల ఐలాండ్‌ల వద్ద రెస్టారెంట్లు, హోటల్స్‌ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొత్తగా పెళ్‌లైన వాళ్లకి మంచి స్పాట్‌ ఇది.– పునీత్‌ బొమ్మ, సమైఖ్య

ఆనందమైనా.. బాధైనా అక్కడికే
నాకెంతో ఇష్టమైన టూరిస్ట్‌ స్పాట్‌ మాల్దీవులు. నాకు ఆనందం వేసినా, బాధ కలిగినా మాల్దీవులకు వెళ్తా. అమల వస్తే ఇద్దరం కలసి వెళ్తాం. లేదంటే నేనొక్కడినే వెళ్లిపోతా.  ఈ దీవుల్లోని అద్భుతమైన..ఆహ్లాదకర వాతావరణం మనసుకు ఎంతో  గొప్ప    ఉత్తేజాన్ని ఇస్తుంది.– సోషల్‌ మీడియాలో హీరో అక్కినేని నాగార్జున

సూపర్బ్‌ ప్లేస్‌..
‘నీలం రంగులోని సముద్రపు నీళల్లో స్విమ్మింగ్, డైవ్‌ కొట్టడం సూపర్బ్‌గా ఉంది. మన దేశానికి అతి దగ్గరగా ఇంత అద్భుతమైన సముద్రాలు ఉండటం నిజంగా నాకెంతో ఎక్సైట్‌మెంట్‌ అనిపించింది. ఎనీవేమాల్దీవ్స్‌..వావ్‌ అన్పించాయి.’.  – సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ కియారా అద్వానీ

చార్జీలు ఇలా
మాల్దీవులకు వెళ్లాలంటే ఫ్లైట్‌ ఎక్కాల్సిందే. ఫ్లైట్‌ ధర ఇప్పటికిప్పుడు వెళ్లాలంటే ఫ్లైట్‌ ధర రూ.11 వేలు ఉంది. అదే వారం రోజుల తర్వాత అంటే రూ.7 వేలకే లభిస్తుంది. అంటే ఫ్లైట్‌లో వెళ్లి తిరిగి రావడానికి ఒక్కో మనిషికి అయ్యే ఖర్చు రూ.20 వేలు. అక్కడ మనం ఎంచుకునే హోటల్‌ని బట్టి ధరలు ఉంటాయి. సాధారణ హోటల్‌లో ఒక్క రాత్రి బసకు రూ.2 వేల చొప్పున చార్జ్‌ చేస్తుండగా..ఫైవ్‌స్టార్‌ వంటి హోటల్‌లో ఒక్క రాత్రికి రూ.5 వేలు, 7 వేలు చొప్పున చార్జ్‌ చేస్తున్నారు. ఇవి కాకుండా అక్కడ దరొకే ఫుడ్, మెనూ మనల్ని నోరూరిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వంటకాలు మాల్దీవుల్లో లభించడం విశేషం. ఒక వ్యక్తి మాల్దీవులను నాలుగు రోజుల పాటు విజిట్‌ చేసి రావాలంటే కనీసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందని ట్రావెల్స్‌ ఏజెంట్లు చెబుతున్నారు.

ఇవీ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే నీటి లోపల కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించిన తొలి దేశం మాల్దీవులు. 2009లో సముద్ర మట్టాలు పెరగటం వల్ల ముంచుకొస్తున్న ముప్పుని ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఈ తరహా సమావేశాన్ని జలగర్భంలో ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్‌తో పాటు 13 మంది ప్రభుత్వ అధికారులు స్కూబా గేర్స్‌ వేసుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు.  
ప్రపంచంలోనే సేఫెస్ట్‌ హాలిడే ప్లేస్‌గా గుర్తింపు  
ప్రపంచంలోనే చదునైన దేశం...ఆసియాలోనే అతి చిన్న దేశం  
టూరిస్టులు అక్కడి పద్ధతులను తప్పకుండా గౌరవించాల్సి ఉంటుంది.  
హోటళ్లు, రిసార్టుల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది. ఆ పరిసరాల నుంచి బయటకు తీసుకురావటం, మిగతా చోట్ల తాగటం నిషేధం.  
అక్కడ వారాంతాలు అంటే మనలా శని, ఆదివారాలు కాదు. శుక్ర, శనివారాలను వీకెండ్‌గా పాటిస్తారు.  

వుయ్‌ లవ్‌ మాల్దీవ్స్‌
మాల్దీవ్స్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎవ్రీ వెకేషన్‌కి మేం అక్కడకు వెళ్తుంటాం. అక్కడున్న బీచ్‌లలో గంటల కొద్దీ ఎంజాయ్‌ చేయొచ్చు. వెకేషన్‌ అయ్యాక తిరిగి వస్తుంటే ఏదో మిస్‌ అయినట్లు ఉంటుంది.
ఇక్కడకు వచ్చాక మాల్దీవుల గురించి మా ఫ్రెండ్స్‌కు చెప్తుంటే వాళ్లు కూడా ఫిదా అవుతున్నారు.  – ప్రియాంక, సహస్ర, అంజలి, నిత్య

వింటర్‌లో... వైన్‌ యార్డ్స్‌..

లాసాన్నె, మాంట్రెక్స్‌లకు మధ్య కొలువుదీరింది ది యునెస్కో వరల్డ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ లావాక్స్‌ వైన్‌యార్డ్స్‌. ఈ సీజన్‌లో వైన్‌ ప్రియులకు చవులూరించే పిక్నిక్‌ స్పాట్‌ ఇది. దాదాపు 800 హెక్టార్లలో విస్తరించిన లావాక్స్‌ స్విట్జర్లాండ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ద్రాక్ష సాగు ప్రారంభమయ్యే సమయంలో ఈ తోటల ఉపరితలం మొత్తం ఆరెంజ్, గోల్డ్‌ కలర్స్‌లో అపురూపంగా కనిపిస్తుంది కాబట్టి ఈ వైన్‌ యార్డ్స్‌ని సందర్శించడానికి ఇది అనువైన సీజన్‌ అని పర్యాటక రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఓర్వకల్‌.. వండర్‌ఫుల్‌
ప్రకృతి ఒడిలో అందమైన రాతి కొండలు శిల్పాలను తలపిస్తున్నాయి. చుట్టూ కొండలు, వీటి మధ్యలో నీటి కుంట.. ఈ–వేస్టేజ్‌తో చేసిన కళారూపాలతో కర్నూలు జిల్లా ఓర్వకల్‌ వద్ద ఉన్న ‘ఓర్వకల్‌ రాక్‌ గార్డెన్స్‌’ విహార యాత్రికులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ నగరానికి 250 కి.మీ దూరంలో కర్నూలు– కడప హైవే పక్కనే ఈ రాక్‌ గార్డెన్‌ ఉంది. ఇక్కడ రాళ్లే వివిధ ఆకృతుల్లో కొలువుదీరి అబ్బుర పరుస్తాయి. ఏపీ టూరిజం అనుసంధానంతో ఉన్న రాక్‌గార్డెన్‌ సమీపంలో చిన్నారులు ఆడుకోవడానికి ఆట స్థలాలు, రెస్టారెంట్, పలు విభిన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి.   – శ్రీనగర్‌కాలనీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top