గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

Blood Pressure Count For Heart Stroke - Sakshi

అధిక రక్తపోటు గుండెజబ్బులకు దారితీస్తుందని మనం చాలాకాలంగా వింటూనే ఉన్నాం. రక్తపోటును కొలిచేందుకు ఉపయోగించే రెండు అంకెలు (డయాస్టోలిక్, సిస్టోలిక్‌ ) ద్వారా కూడా గుండెపోటు, జబ్బులను ముందుగానే గుర్తించవచ్చునని  కైసర్‌ పర్మనెంటే అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. గుండె ఎంత శక్తితో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతుందో తెలిపేది సిస్టోలిక్‌ రీడింగ్‌ కాగా... లబ్‌ డబ్‌ల మధ్య గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు ధమనులపై ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్‌ రీడింగ్‌ సూచిస్తుంది.

న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు వైద్యులు దశాబ్దాలుగా సిస్టోలిక్‌ అంకెపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని.. డయాస్టోలిక్‌ అంకెను పరిగణించాల్సిన అవసరం లేదని కూడా చెబుతారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ సి ఫ్లింట్‌ తెలిపారు. తాజా అధ్యయనం మాత్రం రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోందని చెప్పారు.  తాము దాదాపు మూడు కోట్ల అరవై లక్షల మంది తాలూకూ రక్తపోటు వివరాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని.. 20007 –16 మధ్యకాలంలో ఈ వివరాలను తీసుకోగా డయాస్టోలిక్‌ అంకెకూ గుండెపోటు, జబ్బులను అంచనా వేయడంలో తగిన ప్రాధాన్యమున్నట్లు తెలిసిందని చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top