శిరోజాల నిగనిగలకు మేలైన షాంపూ..

Beauty tips for hair - Sakshi

కుంకుడుకాయ, షికాయలను నానబెట్టి రసం తీసి దీంట్లో ఉసిరిపోడి, మందారపువ్వుల పొడి, టీ స్పూన్‌ బంకమట్టి, మెంతి పొడి, గోరింటాకు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలలో పోసి డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టాలి. షాంపూల వాడకం వల్ల జుట్టు పాడైపోతుందనుకునేవారు సహజసిద్ధంగా లభించే వాటితో ఇలా ఐస్‌క్యూబ్స్‌లా చేసి, అవసరమైనప్పుడు తలంటుకోవచ్చు
పదిహేను రోజులకొకసారి పప్పుల మిశ్రమంతో తయారుచేసిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇందుకు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి సమభాగాలుగా తీసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు లేదా కుంకుడు రసం కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసి, మృదువుగా రుద్దుతూ నీటితో కడిగేయాలి.        కొబ్బరి నూనె/నువ్వుల నూనెలో ఉసిరి లేదా మందార పువ్వు లేదా కరివేపాకు వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి, మృదువుగా మసాజ్‌ చేయాలి. అలాగే వెంట్రుకల చివర్లకూ రాయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్‌ చేసి, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది, వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top