చర్మ సౌందర్యాన్ని చెప్పే స్కిన్‌ 360...

beauty tips - Sakshi

పట్టులాంటి మృదువైన చర్మం కావాలని  ఏ మహిళ ఆశించదు చెప్పండి. ఇందుకోసమే  కదా..  బోలెడన్ని క్రీములు, లోషన్లు వాడేది. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మన చర్మం ఎలా ఉందో.. అంటే స్వేదగ్రంధులు ఎంత లోతు ఉన్నాయి? చర్మంలో తగినంత తేమ ఉందా? లేదా? వంటి విషయాలేవీ తెలియకుండానే మేకప్‌ చేసేసుకుంటూ ఉంటారు. ఇకపై ఈ చిక్కు లేదులెండి. న్యూట్రాజెనా స్కిన్‌ 360 ఓ వినూత్నమైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది. చిన్న సైజు డబ్బాలా ఉండే ఓ పరికరాన్ని ఐఫోన్‌ కెమెరాకు అనుసంధానించి చర్మంపై ఉంచితే చాలు.. మన చర్మ ఆరోగ్యం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకోసం ఈ పరికరంలో దాదాపు 12 ఎల్‌ఈడీ లైట్లు.. 30 రెట్లు జూమ్‌ చేయగలిగిన కెమెరా, కొన్ని సెన్సర్లు ఉంటాయి. స్వేదగ్రంధుల సైజు, లోతులతోపాటు చర్మపు ముడుతల పరిస్థితిని కూడా ఈ పరికరం లెక్క కట్టి వైర్‌లెస్‌ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్‌ను సమాచారాన్ని చేరవేస్తుంది.

మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా మన చర్మ ఆరోగ్యానికి స్కోర్‌ కూడా ఇస్తుంది ఇది. దీని ఆధారంగా ఏఏ అంశాలపై దృష్టిపెడితే చర్మం మృదువుగా తయారవుతుందో మనకు తెలిసిపోతుందన్నమాట. ప్రస్తుతానికి ఇది ఏ రకమైన చర్మ వ్యాధులకు సంబంధించిన సమాచారం సేకరించదు. మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ వినూత్న పరికరాన్ని ఈ వారం లాస్‌వెగాస్‌లో మొదలైన ‘సీఈఎస్‌ –2018’లో ప్రదర్శిస్తున్నారు. ధరంటారా... కొంచెం అటుఇటుగా మూడు వేల రూపాయల వరకూ ఉంటుంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top