సోమిరెడ్డిదంతా కల్తీ రాజకీయం


 పొదలకూరు, న్యూస్‌లైన్ : సోమిరెడ్డి లాంటి కల్తీమయమైన రాజకీయ జీవితం కలిగిన నాయకుడిపై తాను పోటీ చేయడం దౌర్భాగ్యమని, చిల్లర రాజకీయాలు చేస్తూ దిగజారుడు విమర్శలు చేసే వ్యక్తి గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

 

 

 ఎన్నికల ప్రచారం లో భాగంగా శుక్రవారం ఆయన సూరాయపాళెం, యర్రబల్లి, విరువూరు, మహ్మదాపురం, తా టిపర్తి, నల్లపాళెం, ఆనాటికండ్రిక, ఉలవరపల్లి, పీజీపట్నం, నావూరు, నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రంలో పర్యటించారు. కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఇం టి పక్కనే కల్తీ ఎరువులు తయారుచేయించింది సోమిరెడ్డి కాదా..అని ప్రశ్నించారు. అప్పట్లో మం త్రి హోదాలో కేసును మాఫీ చేయించుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు కల్తీ మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. సోమిరెడ్డే తన అనుచరుల ద్వారా కల్తీ మద్యాన్ని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్ద పెట్టింది కేసులు పెట్టించినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు.

 

 ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణు లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఘ టనలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దో షులను శిక్షించాలని డిమాండ్‌చేశారు. సోమిరెడ్డికి వంట్లోనే కాదు రాజకీయంగానూ సత్తువ లేదన్నా రు. కారుకూతలు కూయడంలో ఆయన్ను మిం చిన వారు లేరన్నారు. పోర్టు వద్ద బూడిదగుం టలు వద్దని కంపెనీలను బ్లాక్‌మెయిల్ చేసి చిల్లర దండుకోలేదని సోమిరెడ్డి ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. తనకు ఏ కంపెనీ వారితో సం బంధాలు లేవని తాను బహిరంగా ప్రమాణం చే సేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పేదవాడినని ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకునే రాజకీయం చేస్తున్నట్టు విమర్శించారు. పోరాటాలు చేశారని ప్రచారం చేసుకునే సోమిరెడ్డి ఎ వరి కోసం పోరాడి ఏమి సాధించారో చెప్పాల న్నారు. ఆయన పోరాట మంతా కంపెనీల వద్ద చిల్లర దండుకునేందుకేనన్నారు. సర్వేపల్లి ప్రజ లపై ప్రేమ ఉన్న వ్యక్తి 19వతేదీ వరకు ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఐ దేళ్లు కనిపించకుండా ఇప్పటికిప్పుడు వచ్చి ఓట్లు అడిగితే వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. సీమాంధ్రకు దశదిశ నిర్ధేశించేది జగన్ ఒక్కరేన్నా రు.  ఆయా గ్రామాల ప్రజలు కాకాణికి బ్రహ్మర థం పట్టారు.



 కార్యక్రమంలో పార్టీ జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, స ర్పం చ్‌లు కోళ్లకాడి అచ్చెమ్మ, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, గద్దె ఆనంద్‌బాబు, వి.వెంకటరత్నమ్మ, బొడ్డు జయమ్మ, వి.వెంకటరమణమ్మ, త్రోవగుం ట రమాదేవి, నాయకులు కొల్లి రాజారెడ్డి, దుద్దుగుంట వెంకటరమణారెడ్డి, పులి సుబ్బారెడ్డి, పూండ్ల వెంకటనర్సారెడ్డి, పిన్నంరెడ్డి అశోక్‌రెడ్డి, బొడ్డు చినమాలకొండారెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, నోటి మాలకొండారెడ్డి, బొడ్డు నరసింహులు, కాకు పెంచలయ్య  పాల్గొన్నారు.

 

 వైఎస్సార్‌సీపీలో చేరిక

 తాటిపర్తికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో సొసైటీ మాజీ డెరైక్టర్ అక్కెం చంద్రప్రభ, దువ్వల అశోక్‌రెడ్డి, తాటిగల్ల సుధాకర్‌రెడ్డి, ఉయ్యాల కృష్ణారెడ్డి, ఉయ్యాల పెంచలరెడ్డి తదితరులు ఉన్నారు.

 

 వైఎస్సార్‌సీపీలోకి కాంగ్రెస్,

 టీడీపీ నాయకులు

 తోటపల్లిగూడూరు: కోడూరు పంచాయతీ పాతపాళెం, కోడూరు ఎస్సీకాలనీకి చెందిన పలువురు కాంగ్రెస్,టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చే రారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కోడూరుబిట్-2 నుంచి పోటీచేసిన బల్లెంబాల కృష్ణ, బల్లెం జగన్నాథం, బల్లెం సురేంద్ర,బైనా ఆ దిశేషయ్య, పాతపాళేనికి చెందిన పామంజివాసులతో పాటు సుమారు 50 మంది పార్టీలో  చేరారు. కావలిరెడ్డి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top