నేడు హైదరాబాద్‌లో పవన్ ప్రచారం

నేడు హైదరాబాద్‌లో పవన్ ప్రచారం - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార పర్యటన ఖరారైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జరిపిన చర్చల్లో ఏ హామీ లభించిందో తెలియదు గానీ.. టీడీపీ-బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన సంసిద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలోని ఆరు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. టీ-టీడీపీ సీఎం అభ్యర్థి కృష్ణయ్య, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఆయన వెంట పర్యటించనున్నట్లు సమాచారం. కాగా పవన్ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు.


 పవన్ ప్రచార షెడ్యూల్: 25న షాద్‌నగర్, కల్వకుర్తి, సికింద్రాబాద్, ఖైరతా బాద్, శేరిలింగంపల్లిలో... 26న రామగుండం, సిరిసిల్ల, హుస్నాబాద్, పాల కుర్తిలో... 27న ఎల్‌బీనగర్, మహేశ్వరం, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్ పేట్‌లో... 28న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాల్కొండ నియోజక వర్గాల పరిధిలో పవన్ ప్రచారం నిర్వహించనున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top